Mrunal Thakur Love: “సీతారామం” బ్యూటీ ప్రేమలో ఉందట..! ఆ హీరో ఎవరంటే..?

సీతారామం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన మృణాల్ ఠాకూర్ గురించి సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. తొలి సినిమాతోనే యువ హృదయాలను కొల్లగొట్టడంతో పాటు ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ స్టేటస్ అందుకుంది ఈ ముద్దుగుమ్మ. తన అందచందాలతో ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది ఈ బాలీవుడ్ భామ. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ తెలుగు, హిందీ భాషల్లో దాదాపు 5 సినిమాల్లో నటిస్తుంది.

ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మృణాల్ తన పెళ్లి, రిలేషన్షిప్ స్టేటస్ గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఓ ప్రముఖ నటుడిని ఉద్దేశిస్తూ అతనిలాంటి జీవిత భాగస్వామి తనకు కావాలని చెప్పుకొచ్చింది. “పెళ్లి విషయంలో ఫ్యామిలీ నుంచి నాపై ఒత్తిడి ఉంది. కానీ నేను కెరీర్ పైనే ఫోకస్ పెట్టాను. కెనడియన్ నటుడు కీను రివ్స్ లాంటి వ్యక్తి నా జీవిత భాగస్వామిగా రావాలని కోరుకుంటున్నాను.

అతను అంటే చిన్నప్పటినుండి నాకు ఎంతో ఇష్టం. ఆయనతో నాది వన్ సైడ్ లవ్. చిన్నతనం నుండే అతనితో ప్రేమలో పడ్డాను. అప్పటినుండి రీవ్స్ వంటి జీవిత భాగస్వామి నాకు రావాలని కోరుకుంటున్నాను” అంటూ చెప్పుకొచ్చింది. ఇక ఈ బ్యూటీ ప్రస్తుతం తెలుగులో నానితో నటించిన హాయ్ నాన్న త్వరలోనే విడుదలకు సిద్ధంగా ఉంది. ఆ తరువాత సంక్రాంతికి విజయ్ దేవరకొండ తో కలిసి నటించిన ఫ్యామిలీ స్టార్ సినిమా విడుదల కాబోతోంది.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు