Biggboss season7: వీక్ అని ఒప్పేసుకున్న అమర్ దీప్..

 

బిగ్ బాస్ సీజన్ 7 షో లో కొత్త కంటెస్టెంట్స్ వచ్చాక చాలా ఇంట్రెస్టింగ్ గా షో నడుస్తోందన్న సంగతి తెలిసిందే. ఎందుకంటే బిగ్ బాస్ హౌస్ లో ఆటగాళ్ళకంటే కొత్త కంటెస్టెంట్స్ గా వచ్చిన పోటుగాళ్ళ పెర్ఫార్మన్స్ ఇంకా బాగుంది. ముఖ్యంగా అంబటి అర్జున్ చాలా బాగా ఆడుతూ టఫ్ కాంపిటేషన్ ఇస్తున్నాడు. ఇకపోతే ఈ సీజన్ 7లో మొదట్నుంచి అసహనంగా ఉంటూ, ఓడిపోయిన ప్రతి సారి చాలా ఫీల్ అవుతున్న కంటెస్టెంట్ అమర్ దీప్.

అమర్ దీప్ మొదటి రెండు వారాలు చాలా బాగా ఆడినా, ఆ తర్వాత కొన్ని ఆటల్లో గెలవకపోయే సరికి, హౌస్ మేట్ కూడా కాకపోయేసరికి చాలా నిరుత్సాహపడుతున్నాడు. మొన్నామధ్య రంగు పడుద్ది టాస్క్ లో తనని పెద్దగా పట్టించుకోలేదని మరింత ఫీల్ అయిన అమర్ ఆరోజు పిచ్చి పట్టినట్టు ఉన్నాడు. నాకెవరూ లేరని, నేనొక వ్యర్ధ పదార్ధాన్ని అని అనుకుంటూ తనని తాను తగ్గించుకుంటూ ఆడియన్స్ లో కూడా తగ్గిపోయాడు.

- Advertisement -

ఇక తాజాగా జరిగిన కెప్టెన్సి టాస్క్ లో ఫైనల్ లో యావర్, తేజ అమర్ దీప్ అనగా, తేజ అమర్ బెలూన్ పగలగొట్టే సరికి మరింత ఫీల్ అయ్యి, నేను సాక్రిఫైస్ లు చేశాను, నాకేం గుర్తింపు లేదు అని ఆవేదనకు గురయ్యాడు. ఒక రకంగా తనని సేవ్ చెయ్యమని కంటెస్టెంట్లని బతిమిలాడినట్టు అనిపించింది. ఇలా మాటిమాటికి అడుక్కుంటే ఆడియన్స్ ఎలా ఓటేస్తారని సోషల్ మీడియా లో ట్రోల్ చేస్తున్నారు. అమర్ దీప్ ఈ విషయాన్నీ అర్ధం చేసుకుని తాను స్ట్రాంగ్ అని మనసులో ఫిక్స్ ఆడితేనే ముందుకు వెళతాడు.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు