Bhagavanth Kesari: అనిల్ రావిపూడికి అంత సీన్ లేదా..?

పటాస్ సినిమాతో డైరెక్టర్ గా మారి, ఎంటర్టైనర్స్ కి కేరాఫ్ అడ్రస్ గా మారాడు డైరెక్టర్ అనిల్ రావిపూడి. ప్రస్తుతం బాలకృష్ణ హీరోగా అనిల్ డైరెక్ట్ చేసిన సినిమా భగవంత్ కేసరి సినిమా అక్టోబర్ 19న రిలీజ్ కి సిద్ధంగా ఉంది. రిలీజ్ దగ్గరపడుతన్న నేపథ్యంలో ప్రమోషన్స్ జెట్ స్పీడ్ లో చేస్తోంది సినిమా యూనిట్.ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అనిల్ రావిపూడి తన నెక్స్ట్ ప్రాజెక్ట్స్ గురించి క్లారిటీ ఇచ్చాడు.

మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేష్ బాబులతో అనిల్ సినిమా చేయనున్నాడని చాలా కాలంగా టాక్ ఉంది. అయితే, ఆ వార్తల్లో నిజం లేదని క్లారిటీ ఇచ్చాడు అనిల్.సరిలేరు నీకెవ్వరు సినిమా తర్వాత మహేష్ కి కథ చెప్పానని వార్తలొచ్చాయని, ఆ న్యూస్ చూసి తానే షాక్ కి గురయ్యానని అన్నాడు అనిల్. ప్రస్తుతం గుంటూరు కారం సినిమాతో బిజీగా ఉన్న మహేష్ తర్వాత రాజమౌళి సినిమా స్టార్ట్ చేయనున్నాడు కాబట్టి ఇప్పట్లో మహేష్, అనిల్ కాంబినేషన్ కార్యరూపం దాల్చే అవకాశం లేదు.

చిరంజీవితో ఇప్పటి దాకా స్టోరీ డిస్కషన్స్ జరగలేదని, తమ మధ్య సినిమా గురించి ప్రస్తావన ఎప్పుడూ రాలేదని క్లారిటీ ఇచ్చాడు అనిల్. చిరంజీవితో సినిమా చేసే ఛాన్స్ వస్తే తప్పకుండా చేస్తానని, ఆ ఛాన్స్ కోసం ఎదురు చూస్తున్నా అని అన్నాడు. అయితే, ప్రస్తుతం యంగ్ డైరెక్టర్స్ కి ప్రిఫరెన్స్ ఇస్తున్న చిరంజీవి ఇంతవరకు అనిల్ రావిపూడికి స్టోరీ నేరేట్ చేసే అవకాశం కూడా ఎందుకు ఇవ్వలేదని, అనిల్ కి మెగాస్టార్ ని డీల్ చేసే సత్తా లేదా అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు