Bhagavanth Kesari: జైలర్, జవాన్ తరహాలోనే భగవంత్ కేసరి- ప్రొడ్యూసర్ కామెంట్స్ వైరల్

భగవంత్ కేసరి సినిమా రిలీజ్ టైం దగ్గర పడుతుండటంతో సినిమా ప్రమోషన్స్ లో జోరు పెంచారు మేకర్స్. దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకి రాబోతున్న ఈ సినిమాలో, ట్రైలర్ లో చూపించని విషయాలెన్నో సినిమాలో ఉండబోతున్నాయని బజ్ నడుస్తుండగా, భగవంత్ కేసరి సినిమా వేడి మరింత పెంచేలా.. ప్రొడ్యూసర్ హారిష్ పెద్ది చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.

ఈ ఏడాది రిలీజై.. బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచినా జైలర్, జవాన్, సినిమాల లాగానే భగవంత్ కేసరి సినిమాలో కూడా నందమూరి అభిమానులను కేరింతలు పెట్టించే అంశాలు పుష్కలంగా ఉంటాయట. అనిల్ రావిపూడి తరహా ఫన్ ఎలిమెంట్స్ తో పాటు ఆకట్టుకునే ఫ్యామిలీ డ్రామా కూడా భగవంత్ కేసరి సినిమాలో హై లెట్ అవ్వనుందని ప్రొడ్యూసర్ హారిష్ పెద్ది ఆయన లేటెస్ట్ ఇంటర్వ్యూలో తెలిపారు.

ఇప్పటికే భగవంత్ కేసరి సినిమాకు సంబంధించి.. రిలీజైన పాటలు, ట్రైలర్ లను బట్టి కంటెంట్ ఉన్న సినిమాని ప్రేక్షకుల్లో ముద్ర పడగా లేటెస్ట్ ప్రొడ్యూసర్ చేసిన వ్యాఖ్యలతో భగవంత్ కేసరి కూడా మాస్ మసాలా సినిమానేనని తేలిపోయింది. ఇక రియాలిటీ విషయానికొస్తే కమర్షియల్ గా జైలర్ , జవాన్ సినిమాలు కలెక్షన్స్ ను రాబట్టిన ప్రేక్షకుల్లో రొట్ట సినిమా అనే ఫీలింగ్ నే తెప్పించింది.మరీ ప్రొడ్యూసర్ పోల్చి చెబుతున్నట్టు భగవంత్ కేసరి కూడా ఆ రెండు రిజల్ట్ నే అందుకుంటుందా లేక ఏమైనా మారుతుందా అనేది చూడాలి. అక్టోబర్ 19 న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవ్వబోతున్న ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ అందించారు.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు