Animal : సందీప్ రెడ్డి వంగా నిజ స్వరూపం బయటపెట్టిన ఆర్ట్ డైరెక్టర్

సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రానున్న “యానిమల్” మూవీపైనే దేశ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులందరి దృష్టి ఉంది. డిసెంబర్ 1న ఈ మూవీ థియేటర్లో భారీ ఎత్తున రిలీజ్ కు రెడీ అవుతుంది. “అర్జున్ రెడ్డి” తర్వాత మరోసారి సందీప్ రెడ్డి వంగలోని వైలెంట్ మోడ్ ను చూడడానికి ప్రేక్షకులు తహతహలాడిపోతున్నారు. ఇక ఇప్పటికే “యానిమల్” మూవీకి సంబంధించిన ప్రమోషన్స్ స్టార్ట్ అయ్యాయి. ఈ నేపథ్యంలో సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలు మరింత హైప్ ను క్రియేట్ చేస్తున్నాయి.

ఇటీవల చిత్ర బృందం రిలీజ్ చేసిన ట్రైలర్ యాక్షన్ ప్రియులను పిచ్చెక్కించిందని చెప్పాలి. అయితే ఆ ట్రైలర్ లో ఉన్న అన్ని సన్నివేశాల్లో కెల్లా చివర్లో వచ్చే మెషిన్ గన్ సన్నివేశాలు సందీప్ ఫ్యాన్స్ ను మ్యాడ్ అనిపించేలా చేశాయి. దీంతో మెషిన్ గన్ అనేది ఇప్పుడు ఇండస్ట్రీలో సెంటిమెంట్ అయ్యిందనే చర్చ కూడా మొదలైంది. అయితే తాజాగా ఆ మెషీన్ గన్ కు సంబంధించిన మరో ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. “యానిమల్” మూవీకి ఆర్ట్ డైరెక్టర్ గా పని చేసిన సురేష్ సెల్వరాజన్ కు ఆ మూవీ సెట్స్ లో జరిగిన అద్భుతాన్ని వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన పనిలో పనిగా సందీప్ రెడ్డి వంగా నిజస్వరూపాన్ని బయటపెట్టారు.

ఇక అసలు విషయంలోకి వెళ్తే సురేష్ సెల్వరాజన్ తాజా ఇంటర్వ్యూలో “యానిమల్” మూవీ సెట్ లో జరిగిన ఇంట్రెస్టింగ్ విషయాన్ని వెల్లడించారు. ట్రైలర్ లో చూపించిన మెషిన్ గన్ వీఎఫ్ఎక్స్ కాదని, అది నిజమైందని చెప్పి అందరికీ షాక్ ఇచ్చారు. ఆ మెషిన్ గన్ 500 కేజీల బరువుతో ఉన్న వార్ మెషిన్ గన్ అని, దానిని నిర్మించడానికి దాదాపు నాలుగు నెలల టైం పట్టిందని, స్టీల్ ను ఉపయోగించి రియల్ గా ఓ వ్యక్తి స్వయంగా తన చేతులతో ఆ మెషీన్ గన్ నిర్మించారని ఈ సందర్భంగా ఆర్ట్ డైరెక్టర్ వెల్లడించారు. ఇదివరకు ఎన్నో సినిమాలు భారతీయ సినిమా చరిత్రలో వచ్చాయని, కానీ ఏ సినిమాలోను తాను ఇలాంటి అద్భుతం జరగడం చూడలేదని, సందీప్ విజన్ అలా ఉంటుందంటూ ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. దీంతో సందీప్ రెడ్డి వంగాలోని వైల్డ్ యాంగిల్ ని ఆర్ట్ డైరెక్టర్ సురేష్ సెల్వరాజన్ బయటపెట్టినట్టు అయ్యింది.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు