Deep fake : ఈసారి అలియా బలి… మరీ ఇంత దారుణంగా ఉన్నారేంట్రా మీరు?

సాంకేతికత అభివృద్ధి అనేక రంగాల్లో ఎంతో ఉపయోగకరంగా ఉంది. పెరుగుతున్న టెక్నాలజీ కారణంగా ఎంతోమందికి ఉద్యోగాలు కూడా వస్తున్నాయి. కానీ మరోవైపు దాని దుర్వినియోగం కూడా దారుణంగా ఉంది. ఇటీవల కాలంలో ఏఐ టెక్నాలజీ కారణంగా పలు ఇబ్బందులు తలెత్తడంతో, ఇప్పుడు అసలు అమ్మాయిలకు భద్రత ఎక్కడ ఉంది? అనే ప్రశ్న తలెత్తుతోంది. బాలీవుడ్ సెలబ్రిటీలు గత కొంత కాలంగా డీప్‌ఫేక్ వీడియోల బారిన పడుతున్నారు. ఇప్పటికే నేషనల్ క్రష్ రష్మిక మందన్న డీప్ ఫేక్ వీడియో బయటకు వచ్చి రేపిన దుమారం గురించి తెల్సిందే. ఇప్పుడు ఆ జాబితాలోకి బాలీవుడ్ స్టార్ హీరోయిన్, బాలీవుడ్ బడా హీరో రణబీర్ కపూర్ సతీమణి అలియా భట్ పేరు కూడా చేరింది.

తాజాగా అలియాకు సంబంధించిన డీప్ ఫేక్ వీడియో ఒకటి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఆ వీడియో పోర్న్ వీడియోల లాగా చాలా అసభ్యకరంగా ఉండడంతో అలియా ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. ఓ అమ్మాయికి సంబంధించిన వీడియోను తీసుకుని, దానికి ఏఐ సహాయంతో అలియా ఫేస్ ను యాడ్ చేశారు. అందులో ఆమె ఎక్స్ప్రెషన్స్ , మూమెంట్స్ పోర్న్ స్టార్ కు ఏమాత్రం తీసిపోకుండా ఉన్నాయి. మరి ఈ వీడియో ఇంకా అలియా దృష్టికి వెళ్ళలేదో ఏమోగానీ ఆమె ఇంకా స్పందించనేలేదు. కానీ అలియా ఫ్యాన్స్ మాత్రం ఆ వీడియో షేర్ చేయొద్దని కోరుతూ, వీడియోను అలా క్రియేట్ చేసిన వారిపై ఫైర్ అవుతున్నారు.

రీసెంట్ గా రష్మిక మందన్న లిఫ్ట్ వీడియో కూడా అలాగే ఉండగా, వైరల్ కావడం, దానిపై ఆమె స్పందించిన తీరు డీప్‌ఫేక్ వీడియో టెక్నాలజీ గురించి అందరికీ తెలిసేలా చేసింది. ఈ వీడియో చూసిన తర్వాత రష్మిక చాలా డిస్టర్బ్ అయ్యింది. ఈ వీడియోపై అమితాబ్ బచ్చన్ కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు. రష్మిక వీడియో విషయం సీరియస్ కావడంతో పోలీసులు వీడియోను క్రియేట్ చేసిన నిందితులను కనిపెట్టే పనిలో ఉన్నారు. ఆ తర్వాత కత్రినా కైఫ్, కాజోల్ కూడా అలాంటి డీప్‌ఫేక్ వీడియోల బారిన పడ్డారు. తాజాగా అలియా కూడా డీప్ ఫేక్ కు బాధితురాలిగా మారింది. మరి ఈ వీడియోపై ఈ సెలబ్రిటీ కపూర్ కపుల్ ఎలా స్పందిస్తారో, ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి. కానీ ఈ కేటుగాళ్లు రోజురోజుకి మరీ దిగజారుతూ సెలెబ్రిటీలను దారుణంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. అంతేలేకుండా పోతున్న వీళ్ళ ఆగడాలు ఆగేదెప్పుడో ?
Filmify gives an interesting update on celebrities in Tollywood & Bollywood and other industries. Also provides new movie release dates & updates, Telugu cinema gossip, and other Movies news, etc.

- Advertisement -

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు