RanbeerKapoor: సెన్సార్ సర్టిఫికెట్ కొట్టేసిన “ఆనిమల్”! రన్ టైం ఇంతా?

బాలీవుడ్ లో రాబోతున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా సినిమాల్లో “అనిమల్” ఒకటి. ఈ సినిమాని డైరెక్ట్ చేసింది సందీప్ రెడ్డి వంగ కావడం వల్ల అనిమల్ సినిమా కోసం అటు బాలీవుడ్ తో పాటు, టాలీవుడ్ లో కూడా మంచి అంచనాలు ఉన్నాయి. పైగా రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్స్ కూడా సందీప్ స్టైల్ అఫ్ మేకింగ్ తో భారీ అంచనాలను క్రియేట్ చేసాయి. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ కోసం హీరో రణబీర్ కపూర్ కూడా తెలుగులో బాలయ్య అన్ స్టాపబుల్ షోకి కూడా వచ్చాడు.

ఇక డిసెంబర్ 1న రిలీజ్ కానున్న అనిమల్ సినిమా తాజాగా సెన్సార్ సెర్టిఫికెట్ ని కూడా అందుకుంది. ఈ విషయాన్నీ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ తన ట్విట్టర్ పేజీ ద్వారా తెలిపాడు. “A” సర్టిఫికెట్ సాధించిన ఈ సినిమా ఏకంగా 3 గంటల 21 నిమిషాల నిడివితో ఉంటుందిట. అయితే గతంలో సందీప్ రెడ్డి తీసిన అర్జున్ రెడ్డి కూడా మూడున్నర గంటల నిడివితో తెరకెక్కగా, దానికి కూడా A సర్టిఫికెట్ రావడం జరిగింది. ఆ సినిమా రిలీజ్ కి ముందు ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నా రిలీజ్ తరవాత ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే.

ఇప్పుడు ఆనిమల్ సినిమా సెన్సార్ బోర్డు నుండి A సర్టిఫికెట్ దక్కించుకున్నా కూడా సినిమాపై అంచనాలు పెరిగాయే తప్ప తగ్గలేదు. అయితే లెంగ్త్ మాత్రం ఆడియన్స్ భరించగలరా అనేది ప్రశ్నగా మారింది. ఏది ఏమైనా అనిమల్ సినిమా రిలీజ్ అయ్యాక ఎన్ని సంచలనాలకు దారి తీస్తుందో చూడాలి.

- Advertisement -

For More Updates : Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు