Mansoor Ali Khan: నోరు విప్పితే బతుకులు రొడ్డున పడుతాయి… మెగాస్టార్‌కి మన్సూర్ వార్నింగ్…

ప్రముఖ కోలీవుడ్ నటుడు మన్సూర్ అలీ ఖాన్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ఏకైక పేరు అని చెప్పవచ్చు. సీనియర్ హీరోయిన్ త్రిష పట్ల ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యల వల్ల వివాదం కాస్త ముదిరింది. ముఖ్యంగా ఈ విషయంలో తాను అన్న వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని.. క్షమాపణలు మాత్రం చెప్పనని మన్సూర్ అలీఖాన్ తేల్చి చెప్పాడు. ఇకపోతే త్రిష గురించి తాను తప్పుగా మాట్లాడలేదని.. అందుకే క్షమాపణలు కోరనని తెలిపారు మన్సూర్. అంతేకాదు త్రిష కు క్షమాపణ చెప్పని కారణంగా నడిగర్ సంఘం ఈయనపై నిషేధం విధించడం తో మన్సూర్ మాట్లాడుతూ నడిగర్ సంఘం తప్పు చేసిందని వ్యాఖ్యానించారు.

ఇకపోతే తాజాగా ఈయన పైన చెన్నై పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ విషయాలన్నింటిపై స్పందించిన మన్సూర్ వివరణ అడక్కుండా.. విచారణ జరుపకుండా చర్యలు తీసుకున్నారని.. సినిమాలలో హత్య చేస్తే నిజంగానే చేసినట్లు కాదని.. అలాగే సినిమాలలో రేప్ చేస్తే నిజంగానే చేసినట్లా..? అంటూ ఆయన ప్రశ్నించారు.. అంతేకాదు తనకు వ్యతిరేకంగా ఇచ్చిన స్టేట్మెంట్ను వెనక్కి తీసుకోవడానికి నాలుగు గంటల సమయం నడిగర్ సంఘానికి ఇస్తున్నానని కూడా డెడ్ లైన్ విధించారు. తనకు తమిళనాడు ప్రజల మద్దతు ఉందని.. తాను క్షమాపణ చెప్పే వ్యక్తిలా కనిపిస్తున్నానా అంటూ కూడా ప్రశ్నించారు.

అంతటితో ఆగని మన్సూర్.. త్రిష వ్యవహారం పై స్పందించిన వారికి ఓ వార్నింగ్ కూడా ఇచ్చాడు. తాను నోరు విప్పితే ఇండస్ట్రీలో ఉండే చాలామంది బ్రతుకులు రోడ్డున పడతాయని హెచ్చరించారు. తాజాగా దీనిపై మెగాస్టార్ చిరంజీవి స్పందించిన సంగతి తెలిసిందే. దీంతో మన్సూర్ వార్నింగ్ ఇచ్చింది మెగాస్టార్ ను ఉద్ధేశించే అని అంటున్నారు నెటిజన్లు. అయితే మన్సూర్ వ్యాఖ్యలతో మెగా ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.

- Advertisement -

ఇకపోతే త్రిష – మన్సూర్ మధ్య వివాదానికి గల కారణం ఏమిటి అంటే.. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న మన్సూర్ మాట్లాడుతూ.. గతంలో తాను ఎన్నో రేప్ సీన్లలో నటించానని అయితే లియో సినిమాలో ఛాన్స్ రావడంతో త్రిష తో కూడా అలాంటి సీన్ వస్తుందని.. అయితే అందులో అలాంటి సీన్ లేదు సరి కదా అసలు తనకు త్రిష మధ్య ఎటువంటి సీన్ సృష్టించలేదని అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇక ఈయన చేసిన వ్యాఖ్యలే ఇప్పుడు మరింత దుమారాన్ని రేపాయి. ఏదిఏమైనా దక్షిణాది తారలు త్రిషకు మద్దతు ప్రకటిస్తుండగా మన్సూర్ ఇలాంటి సమయంలో మళ్లీ అలాంటి వ్యాఖ్యలు చేస్తూ ఉండడం గమనార్హం.

For More Updates : Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు