Anasuya: భర్తతో డివోర్స్… గుడ్ బై అంటూ పోస్ట్

బుల్లితెరపై గ్లామర్ ను వలకబోస్తూ యాంకర్ గా ఒక కొత్త ట్రెండ్ కు తెరలేపిన బ్యూటీ అనసూయ భరద్వాజ్. ఆమెను టాలీవుడ్ ప్రేక్షకులు రంగమ్మత్త అని ముద్దుగా పిలుచుకుంటూ ఉంటారు. జబర్దస్త్ అనే షోలో యాంకర్ గా కెరీర్ ప్రారంభించిన అనసూయ ప్రస్తుతం స్టార్ హీరోల సినిమాల్లో కీలక పాత్రలు చేసే స్థాయికి చేరుకుంది. మరోవైపు లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తూ తనలోని హీరోయిన్ యాంగిల్ ను, టాలెంట్ ను బయటపెడుతోంది. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ బ్యూటీ పలు వివాదాలతో వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. తాజాగా అనసూయ గుడ్ బాయ్ అంటూ ఇంస్టాగ్రామ్ లో చేసిన పోస్ట్ ఒకటి పలు అనుమానాలకు దారితీస్తోంది.

దీంతో అసలు అనసూయ ఆ పోస్ట్ చేయడానికి కారణం ఏమిటనే చర్చ మొదలైంది. తన సినిమా అప్డేట్స్ ఫోటోషూట్స్ ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోలు ఇలా ప్రతిదీ సోషల్ మీడియాలో షేర్ చేసుకునే అనసూయ ఎవరైనా తనపై నెగటివ్ కామెంట్ చేస్తే మాత్రం గట్టిగా ఇచ్చి పడేస్తుంది. ఇక తన మనసులోని మాటను కుండబద్దలు కొట్టినట్టుగా చెప్పే అనసూయ ఎన్నోసార్లు ట్రోలింగ్ కు గురైంది. తాజాగా ఈ బ్యూటీ తన ఇంస్టాగ్రామ్ స్టేటస్ లో “ఎడబాటే అగౌరవానికి నా సమాధానం. ఇకపై నేను స్పందించను, వాదించను, డ్రామా ఉండదు. సింపుల్గా కలవడం మానేస్తా అంతే” అంటూ పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఆమె చేసిన పోస్ట్ వైరల్ కాగా ఆమె అసలు ఎవరిని ఉద్దేశించి ఇలాంటి కామెంట్స్ చేసింది అనేది సస్పెన్స్ గా మారింది.

దీంతో కొంతమంది అనసూయ తన భర్త గురించే ఇలా పోస్ట్ చేసిందని, ఈ పోస్ట్ చూస్తుంటే వీరిద్దరూ త్వరలో విడాకులు తీసుకోబోతున్నారని అనిపిస్తోందంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న అనసూయ ఫ్యామిలీని పట్టించుకోకపోవడం వల్లే వాళ్ల ఫ్యామిలీలో విభేదాలు వచ్చి ఉంటాయని, ఆమె తన భర్త గురించే అలా ఇన్ డైరెక్ట్ గా పోస్ట్ చేసి ఉండొచ్చని జోస్యం చెబుతున్నారు. మరోవైపు ఎవరో తనను హర్ట్ చేసి ఉంటారని, అందుకే అలా అనసూయ రియాక్ట్ అయి ఉంటుందని అభిమానులు సర్ది చెప్పుకుంటున్నారు. ఇక సోషల్ మీడియాలో ఎప్పుడూ వివాదాల్లో నిలిచే అనసూయ తనను హేట్ చేసే వాళ్లకే ఇలా గట్టిగా కౌంటర్ ఇచ్చిందని, తనపై నెగిటివ్ కామెంట్స్ చేసే వాళ్లతో ఇకపై వాదించనని, సోషల్ మీడియా ఇంటరాక్షన్ కు దూరంగా ఉంటాననే విషయాన్ని ఇలా పోస్ట్ చేసిందని అంటున్నారు మరి కొంతమంది. ఏదేమైనా అనసూయ ఆ పోస్ట్ వెనుక అసలు అర్థం ఏంటన్న విషయం ఆమె స్పందిస్తేనే గాని తెలియదు.

- Advertisement -

Check out Filmify for the latest Movie updates, New Movie Reviews, Ratings, and all the Entertainment News in Tollywood & Bollywood and all other Film Industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు