Aishwarya Arjun: ఐశ్వర్య అర్జున్ నిశ్చితార్థపు ఉంగరం ధర తెలిస్తే షాక్…!

యాక్షన్ కింగ్ అర్జున్ సర్జ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అటు కన్నడ చిత్రాలతో పాటు ఇటు తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా దగ్గరైన ఈయన తన కూతుర్ని ఇటీవలే ఒక ఇంటి కోడలు చేయబోతున్న విషయం తెలిసిందే. తాజాగా ఐశ్వర్య అర్జున్ నిశ్చితార్థం కూడా ఒక గుడిలో జరిగింది. ప్రముఖ నటుడు తంబి రామయ్య కుమారుడు నటుడు ఉమాపతితో ఈమె నిశ్చితార్థం జరిగింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు కూడా సోషల్ మీడియాలో చాలా వైరల్ అయ్యాయి.

వాస్తవానికి ఐశ్వర్య అర్జున్ , ఉమాపతి గత కొన్ని సంవత్సరాలుగా ప్రేమలో ఉన్నారట. ఈ కారణంగానే పెద్దలను ఒప్పించి వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టనున్నారు. ఇదిలా ఉండగా తాజాగా నిశ్చితార్థ కార్యక్రమాన్ని కెమెరాలో కవర్ చేసిన కెమెరామెన్ అద్విక్ సుదర్శనన్ నిశ్చితార్థం గురించిన వివరాలను వెల్లడించారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. అర్జున్ తన కూతురి నిశ్చితార్థం రోజున ఒక తండ్రిగా చాలా సంతోషంగా ఉన్నారు. నిశ్చితార్థానికి చక్కగా సిద్ధం చేసేందుకు బెంగళూరు నుంచి ఈవెంట్ మేనేజ్మెంట్ బృందాన్ని పిలిచినట్లు అద్విక్ వెల్లడించారు.

ఐశ్వర్య చెప్పినట్టుగానే తన డ్రెస్సింగ్ కలర్ విషయం మొదలు కేక్ , డెకరేషన్ అన్నింటిలో కూడా చాలా సింపుల్ గా ఉండేటట్లు డెకరేట్ చేసినట్లు సమాచారం. మరోవైపు తాజాగా ఈ నిశ్చితార్థ వేడుకలలో ఉమాపతి , ఐశ్వర్య అర్జున్ ధరించిన ఉంగరం గురించి కూడా అద్విక్ వెల్లడించారు. 5 క్యారెట్ బ్లడ్ రూబీ రింగ్ వీరు ధరించినట్లు వెల్లడించారు. అంతేకాదు ఈ ఉంగరాన్ని నేరుగా బర్మా నుంచి తెప్పించారట. చాలా అరుదైన కలయిక ఈ ఉంగరం అని అద్విక్ వెల్లడించారు. అంతేకాదు దీని ధర అక్షరాల రూ.20 లక్షలకు పైమాటే నట. ఇకపోతే ఈ ఉంగరం ధర తెలిసి ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతున్నారు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ లు సులభంగా బ్రతికేయొచ్చు అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే వీరికి నిశ్చితార్థం అయితే జరిగింది కానీ పెళ్లి తేదీ ఇంకా ఫిక్స్ చేయలేదు. మరికొద్ది రోజుల్లో పెళ్లి అంగరంగ వైభవంగా జరగబోతుందని అర్జున్ సర్జా కుటుంబ సభ్యులు వెల్లడించారు.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు