Arjun Sarja : ఇంకో హీరోతో హిట్ కొడతా..

అర్జున్ సర్జా దర్శకత్వంలో తెలుగులో ఒక సినిమా వస్తుంది. దీనిలో అర్జున్ కూతురు ఐశ్వర్య అర్జున్ హీరోయిన్ గా నటిస్తుండగా, విశ్వక్ సేన్ హీరోగా చేస్తున్నాడు. ఈ రోజు మార్నింగ్ నుంచి దీనికి సంబంధించి ఓ వార్త తెగ వైరల్ అయింది. ఈ ప్రాజెక్ట్ నుంచి విశ్వక్ సేన్ బయటకు వచ్చాడు అని ఆ వార్తల సారాంశం. దీనిపై అర్జున్ సర్జా ప్రత్యేకంగా ప్రెస్ మీట్ పెట్టి మరీ స్పందించాడు.

ఈ ప్రెస్ మీట్ లో .. ఈ ప్రాజెక్ట్ నుంచి ఎవరు వెళ్లిపోలేదని చెప్పాడు. తానే సినిమాను ఆపేశానని వెల్లడించాడు. ఈ విషయమే చెప్పడానికే తాను ప్రెస్ మీట్ కు వచ్చానని చెప్పుకొచ్చాడు. అలాగే విశ్వక్ సేన్ ప్రవర్తన కూడా బాగలేదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. “విశ్వక్ సేన్ వల్ల ఇప్పటికే రెండు సార్లు పూర్తి షెడ్యూలను క్యాన్సిల్ చేశాను. ముందుగా ఒక సారి బాడీ పెయిన్స్ అంటూ షూటింగ్ కు రాలేదు. అలాగే నవంబర్ 3 నుంచి పక్కా స్టార్ట్ చేద్ధామని చెప్పాడు. కానీ మార్నింగ్ 4 గంటలకు సారీ సినిమా షూటింగ్ ను క్యాన్సిల్ చేయండి సార్ అంటూ మేసేజ్ చేశాడు. రెండు సార్లు ప్రొడక్షన్ బాయ్స్ నుంచి ప్రతి ఒక్కరు ఎంతో కష్టపడి షెడ్యూల్ ను ప్లాన్ చేశాం. కానీ విశ్వక్ ఒక మెసేజ్ తో షూటింగ్ ను క్యాన్సిల్ చేశాడు” అంటూ చెప్పుకొచ్చాడు.

అలాగే “తమ మధ్య రెమ్యూనరేషన్ గురించి కూడా బేదాభిప్రాయాలు లేవు. ముందుగా విశ్వక్ పెద్ద మొత్తంలో అడిగారు. కానీ అంత చేయలేను అని చెప్పాను. దీంతో ఒక ఏరియా హక్కులు ఇవ్వాలని అన్నాడు. దానికి నేను అంగీకరించాను. అలాగే స్టోరీ పరంగా కూడా ఎలాంటి సమస్యలు లేవు. నేను ఇప్పటి వరకు విశ్వక్ రెండు సార్లు స్టోరీ చెప్పాను. ప్రతి సారి స్టోరీ సూపర్ గా ఉంది అని అన్నారు అంతే కానీ ఒక్క మార్పు కూడా చెప్పలేదు” అని వివరించారు.

- Advertisement -

కానీ విశ్వక్ కు ఈ ప్రాజెక్ట్ లో కొన్ని నచ్చనివి ఉన్నాయని అర్జున్ చెప్పుకొచ్చాడు. సాయి మాదవ్ బుర్ర డైలాగ్స్, చంద్ర బోస్ సాహిత్యం, అనూప్ రూబెన్స్ మ్యూజిక్ నచ్చలేదని వారిని మార్చమన్నట్టు తనకు చెప్పారని వివరించాడు. కానీ వీరు అందరూ కూడా ఇండస్ట్రీలో టాప్ హోదాలో ఉన్నారని, అలాంటి వారిని మార్చలేనని విశ్వక్ కు చెప్పానని తెలిపారు.

ప్రస్తుతం తమ ప్రాజెక్ట్ ను తానే ఆపేశానని ప్రకటించాడు. అతి త్వరలోనే బెస్ట్ యాక్టర్ తో మళ్లీ షూటింగ్ స్టార్ట్ చేస్తానని వెల్లడించారు. తెలుగులో ఇప్పటి వరకు చాలా అద్భుతమైన సినిమాలు వచ్చాయి. ఆ లిస్ట్ లో తమ సినిమా కూడా ఉంటుందని ధీమా వ్యక్తం చేశాడు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు