Salaar: ప్రభాస్ ప్రేమలో సారా టెండూల్కర్?

టాలీవుడ్ స్టార్ హీరోలలో ప్రభాస్ ఒకరు. కృష్ణంరాజు వారసత్వాన్ని అందిపుచ్చుకుని… ఇండస్ట్రీ లోకి హీరోగా అడుగు పెట్టారు ప్రభాస్. ఆ తర్వాత తానేంటో నిరూపించుకున్నాడు. ముఖ్యంగా ‘బాహుబలి’ తర్వాత రెబల్ స్టార్ ప్రభాస్ స్టార్ డమ్ ఏ రేంజ్ కు చేరుకుందో తెలిసిందే. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా మార్కెట్ పరిధులను కూడా విస్తరించి ఆ తర్వాత వచ్చిన అనేక సినిమాలకు దారి చూపింది.

ఇక ప్రభాస్ హీరోగా నటిస్తున్న మరో భారీ యాక్షన్ సినిమా ‘సలార్’. ఈ సినిమాకు కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు. భారీ అంచనాల నడుమ వస్తున్న ఈ సినిమా షూటింగ్ పూర్తి అయ్యింది. ప్రస్తుతం టీం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో సూపర్ బిజీగా ఉంది. యాక్షన్ డ్రామ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా డిసెంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానందుని టీం ప్రకటించింది.

ఇక ఈ సినిమా ట్రైలర్ కోసం ప్రభాస్ ఫ్యాన్స్ వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాకు కనీవినీ ఎరగని రేంజ్ లో బిజినెస్ జరుగుతోందని తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించి కేవలం తెలుగు రాష్ట్రాల రైట్స్ దాదాపుగా 165 కోట్లకు పైగా అమ్ముడు అయినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా… తాజాగా సచిన్ టెండూల్కర్ కూతురు సారా ప్రభాస్ పై ఆసక్తికర పోస్టు పెట్టింది. “సలార్ ట్రైలర్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను” అంటూ క్యాప్షన్స్ సైతం రాసుకొచ్చింది. అంతేకాకుండా ఆమె ఓ పోస్టర్ ను కూడా షేర్ చేసింది. దీంతో అది చూసిన ప్రభాస్ ఫ్యాన్స్ “అయ్యబాబోయ్… సారా….నువ్వు కూడా ప్రభాస్ ఫ్యానేనా… సూపర్” అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం సారా పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

- Advertisement -

For More Updates : Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు