Prabhas: ఈ ఒక్కటి చాలు! “సలార్” కోసం ఎంత ఎదురుచూస్తున్నారో చెప్పడానికి?

రెబల్ స్టార్ ప్రభాస్ కెజిఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ కాంబో లో వస్తున్న “సలార్” సినిమాపై ఫ్యాన్స్ తో పాటు కామన్ ఆడియన్స్ బాగా వెయిట్ చేస్తున్నారు. మూడేళ్ళ కిందట మొదలైన ఈ సినిమా పూర్తి కావడానికి ఇంత టైం పట్టింది. ఎప్పుడో ఆరునెలల కిందే రిలీజ్ కావాల్సిన సలార్ చాలా కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తుంది. ఇక రీసెంట్ గా కొన్ని సీన్లు రీ షూట్ కూడా చేసిన విషయం తెలిసిందే.

అన్ని అవాంతరాలు దాటుకుని డిసెంబర్ 22న విడుదల అవుతుందని ప్రకటించిన మేకర్స్ సినిమా ప్రమోషన్ కోసం మాత్రం ఎక్కువ హడావిడి చేయకుండా మెల్లిగా ప్రొసీడ్ అవుతున్నారు. కానీ ఈ సినిమాపై ఉన్న బజ్ ఏమాత్రం తగ్గలేదు సరికదా ఇంకా పెరిగిపోతుంది.

ఇక లేటెస్ట్ గా సలార్ సెట్ చేసిన ఓ రికార్డు, “సలార్” సినిమా కోసం ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు కామన్ ఆడియన్స్ ఎంతలా ఎదురుచూస్తున్నారో తెలియచేస్తుంది. బుక్ మై షో లో ఇండియన్ సినిమా దగ్గర ఫాస్టెస్ట్ గా లక్ష ఇంట్రెస్ట్స్ ని, అది కూడా మేజర్ అప్డేట్ కూడా లేకుండా ఈ సినిమాకి నమోదు కాగా, ఇప్పుడు ఇంకా ట్రైలర్ కూడా రిలీజ్ కాకముందే మరో
సాలిడ్ రికార్డు ని నమోదు చేసింది సలార్. రిలీజ్ కి నెల రోజుల ముందే ఈ చిత్రం ఇప్పుడు బుక్ మై షోలో (500k) హాఫ్ మిలియన్ కి పైగా ఇంట్రెస్ట్స్ ని నమోదు చేసింది.

- Advertisement -

దీన్ని బట్టి రెబల్ స్టార్ ఫ్యాన్స్ సలార్ కోసం ఎంత ఆకలితో ఉన్నారో అర్థమవుతుంది. ఇక సలార్ ట్రైలర్ డిసెంబర్ 1న రిలీజ్ రాత్రి 7.19 నిమిషాలకు రిలీజ్ అవుతుండగా ట్రైలర్ ఎన్ని రికార్డులని సృష్టిస్తుందో చూడాలి.

For More Updates : Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు