Telugu Actress: అలాంటి మూవీ రీమేక్ లో నటించనున్న అనసూయ ?

అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. యాంకర్ వేషాలు వేసుకుంటూ చిన్నగా జబర్దస్త్ షోలోకి ఎంట్రీ ఇచ్చింది అనసూయ. ఈ షోతో పాపులారిటీ సంపాదించుకున్న అనసూయ సినిమాల్లో విలక్షణ నటిగా వెనుదిరిగి చూసుకోలేదు. జబర్దస్త్ యాంకర్ గా పాపులర్ అయిన అనసూయ… అందులో వచ్చిన పాపులారిటీతో సినిమాల్లో అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి.

అలా కెరీర్ ఆరంభం నుంచి ఆమె చేసిన సినిమాలు తక్కువే అయినా… గుర్తింపు మాత్రం భారీగా వచ్చింది. ముఖ్యంగా “క్షణం”, “రంగస్థలం”లో ఆమె చేసిన పాత్రలకు మంచి మార్కులే పడ్డాయి. రీసెంట్ గా ఈమె కృష్ణవంశీ తెరకెక్కించిన రంగమార్తాండలో ప్రకాష్ రాజ్ కోడలుగా కాస్త నెగిటివ్ టచ్ ఉన్న పాత్రలో ఇరగదీసింది. ఇక ఆమె త్వరలో లేడి ఓరియంటెడ్ సినిమాను చేయబోతుందట.

అది కూడా తమిళంలో నయనతార హీరోయిన్ గా నటించిన మూవీని, తెలుగు ప్రేక్షకులకు నచ్చే విధంగా స్క్రిప్ట్ ను మార్చి, అనసూయతో మూవీ చేయబోతున్నాడట. ఇందులో నిజం ఎంత ఉందో తెలియదు కానీ నయనతార ప్లేస్ లో అనసూయ ఎంతవరకు సెట్ అవుతుందని కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరి అనసూయ… ఈ ప్రాజెక్టులో ఎంత మేరకు సక్సెస్ అవుతుందో చూడాలి.

- Advertisement -

Check out Filmify for the latest Movie updates, New Movie Reviews, Ratings, and all the Entertainment News in Tollywood & Bollywood and all other Film Industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు