Maanas Marriage : పెళ్లి కొడుకైన ‘బహ్మముడి’ మానస్ … పిక్స్ వైరల్

ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తుండడంతో చాలామంది సెలబ్రిటీలు పెళ్లి బంధంలోకి అడుగు పెడుతున్నారు. తాజాగా బుల్లితెర నటుడు, బిగ్ బాస్ కంటెస్టెంట్ మానస్ కూడా కొత్త జీవితంలోకి అడుగుపెట్టడానికి ఎంతో ఉత్సాహంగా ఉన్నాడు. గత రెండు నెలల క్రితమే శ్రీజ అనే అమ్మాయితో మానస్ నిశ్చితార్థం ఘనంగా జరిగిన విషయం అందరికీ తెలిసిందే.

తాజాగా మానస్ పెళ్లి వేడుకలు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే ఆయన కుటుంబ సభ్యులు, స్నేహితులు కలిసి ఘనంగా చేసుకున్న హల్దీ వేడుకకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంతేకాకుండా మానస్ ను పెళ్ళి కొడుకుని చేసిన ఫోటోలను ఆయన తల్లి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈరోజు రాత్రి 8 గంటల సమయంలో మానస్ వివాహం జరగబోతున్నట్టుగా సమాచారం. నేడు అంగరంగ వైభవంగా జరగబోతున్న మానస్ పెళ్లి వేడుకకు పలువురు బుల్లితెర సెలబ్రిటీలతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు కూడా హాజరు కాబోతున్నారు.

స్టార్ మా పరివార్ అవార్డ్స్ కార్యక్రమంలో మానస్.. శ్రీజ అనే అమ్మాయితో తన పెళ్లి జరగబోతుంది అంటూ పెళ్లి డేట్ ను అధికారికంగా అనౌన్స్ చేశాడు. అలాగే బిగ్ బాస్ సీజన్ 7లో కంటెస్టెంట్ గా ఉన్న అమర్ దీప్ కి సపోర్ట్ చేస్తూ స్టేజ్ మీదకు వచ్చి, తన పెళ్లి నవంబర్ 22న జరగబోతుందంటూ బుల్లితెర ప్రేక్షకులందరికీ చెప్పేశాడు. కాగా వీరిద్దరిది పెద్దలు కుదిర్చిన వివాహమైనట. ఇక ప్రస్తుతం మానస్ ని పెళ్ళి కొడుకుని చేసిన ఫోటోలు, ఆయన మంగళ స్నానానికి సంబంధించిన పిక్స్ నెట్టింట్లో సందడి చేస్తున్నాయి.

- Advertisement -

ఇక మానస్ కెరీర్ విషయానికొస్తే… ‘బ్రహ్మముడి’ సీరియల్ తో బుల్లితెరను ఏలేస్తున్నాడు. ఆ సీరియల్ లో తన అద్భుతమైన నటనతో ఫ్యామిలీ ఆడియన్స్ ను కట్టిపడేస్తున్నాడు. మానస్ పలు బుల్లితెర సీరియల్స్ లో నటించడమే కాకుండా వెబ్ సిరీస్ లో కూడా కనిపించాడు. బిగ్ బాస్ లో టాప్ ఫైవ్ కంటెస్టెంట్ గా నిలిచి ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్న మానస్ ప్రస్తుతం స్టార్ మాతో పాటు జీ తెలుగులో కూడా పలు సీరియల్స్ చేస్తూ బిజీ బిజీగా గడిపేస్తున్నాడు.

Check out Filmify for the latest Movie updates, New Movie Reviews, Ratings, and all the Entertainment News in Tollywood & Bollywood and all other Film Industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు