Anasuya: చీరకట్టులో అది క‌నిపించేలా అన‌సూయ వీడియో…నెట్టింట వైర‌ల్..!

అనసూయ ఈ పేరుకు ప‌రిచ‌యం అక్క‌ర్లేదు. సాధార‌ణ న్యూస్ రీడ‌ర్ గా కెరీర్ ప్రారంభించిన అన‌సూయ ఆ త‌ర‌వాత జ‌బ‌ర్ద‌స్త్ టీవీ షో ద్వారా ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌ర‌య్యింది. ఈ షోలో క‌మెడియ‌న్ల‌తో స‌హా పంచ్ లు వేస్తూ త‌న టాలెంట్ ను నిరూపించుకుంది. కేవ‌లం మాట‌ల్లోనే కాకుండా ఈ అమ్మ‌డి అందానికి కూడా ప్రేక్ష‌కులు ఫిదా అయిపోయారు. పొట్టి పొట్టి బ‌ట్ట‌ల‌తో యూత్ ను ఫిదా చేసింది. ఇక ఈ షో త‌ర‌వాత అన‌సూయ అస‌లు గ్యాప్ లేకుండా బిజీగా మారిపోయింది. జ‌బ‌ర్ద‌స్త్ బ్యూటీకి సినిమా ఆఫ‌ర్లు కూడా క్యూ క‌ట్టాయి. దాంతో మొద‌టి సినిమా క్ష‌ణంలోనే అద‌ర‌గొట్టింది.

అప్ప‌టి వ‌ర‌కూ అన‌సూయ‌ను గ్లామ‌ర్ యాంగిల్ లోనే చూసిన ప్రేక్ష‌కులు క్ష‌ణంలో ఆమె ప‌ర్ఫామెన్స్ చూసి అవాక్క‌య్యారు. ఈ సినిమా మంచి విజ‌యం సాధించ‌డంతో పాటు అన‌సూయ‌కు మంచి మార్కులు ప‌డ‌టంతో ఆ త‌ర‌వాత వెన‌క్కి చూసుకోలేదు. వెంట‌నే సుకుమార్ పిలిచి రంగ‌స్థ‌లం సినిమాలో రంగ‌మ‌త్త పాత్ర‌కు ఆడిష‌న్ చేశాడు. నిజానికి ఈ పాత్ర కోసం మొద‌ట రాశిని అనుకోగా ఆమె తిరస్క‌రించ‌డంతో ఆ అదృష్టం కాస్తా అన‌సూయ త‌లుపు త‌ట్టింది. ఇక అన‌సూయ కూడా స్టార్ డైరెక్ట‌ర్ సుకుమార్, స్టార్ హీరో రామ్ చ‌ర‌ణ్ సినిమాలో అవ‌కాశం వ‌స్తే కాదంటుందా..?

వెంట‌నే గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. ఇక రంగ‌మ‌త్త పాత్ర‌లో అద‌ర‌గొట్ట‌డంతో అన‌సూయ క్రేజ్ ఒక్క‌సారిగా పెరిగిపోయింది. ఈ సినిమా త‌ర‌వాత స్టార్ హీరోల సినిమాల్లో ఆఫ‌ర్లు అందుకుంది. అంతే కాకుండా ప్రైవేట్ సాంగ్స్ కు కూడా అన‌సూయ‌నే కావాలంటూ డైరెక్ట‌ర్లు వెంట‌ప‌డ్డారు. రంగ‌స్థ‌లం త‌ర‌వాత అన‌సూయ న‌టించిన పుష్ఫ సినిమాకు పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు వ‌చ్చింది.

- Advertisement -

ఈ సినిమాలో అనసూయ నెగిటివ్ పాత్ర‌లో న‌టించి అద‌ర‌గొట్టింది. పుష్ప సీక్వెల్ అన‌సూయ మ‌రింత ప‌వ‌ర్ ఫుల్ గా ఉండ‌బోతుంద‌ని ప్ర‌చారం కూడా మొద‌ల‌య్యింది. ఇక సినిమాల‌తో బిజీగా ఉండే బ్యూటీ ప్ర‌మోష‌న్ష్ తో కూడా ఫుల్ సంపాదిస్తోంది. తాజాగా రాయ‌చోటిలో ఓ షాపింగ్ మాల్ ఓపెనింగ్ వెళ్లిన జ‌బ‌ర్ద‌స్త్ బ్యూటీ లో దుస్తులు క‌నిపించేలా చీర క‌ట్టులో త‌లుక్కుమ‌ని మెరిసింది. ఇక ఓ వీడియో తీసి నెట్టింట పోస్ట్ చేయ‌గా అది తెగ వైర‌ల్ అవుతోంది. దాంతో అనసూయ ఫ్యాన్స్ వీడియోకు కామెంట్ల వ‌ర్షం కురిపిస్తున్నారు.
Check out Filmify for the latest Movie updates, New Movie Reviews, Ratings, and all the Entertainment News in Tollywood & Bollywood and all other Film Industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు