Vijay Deverakonda: ఫ్యామిలీ స్టార్’ కు మరో సమస్య… డైరెక్టర్ అలక దేనికో?

సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ కొత్త మూవీకి వరుసగా సమస్యలు తలెత్తుతున్నాయి. విజయ్ దేవరకొండ హీరోగా, డైరెక్టర్ పరుశురాం దర్శకత్వంలో ఇటీవలే ‘ఫ్యామిలీ స్టార్’ అనే మూవీని ప్రకటించారు. మృణాల్ ఠాకూర్ ఇందులో హీరోయిన్ గా నటిస్తుండగా, మూవీని సంక్రాంతి బరిలో దింపబోతున్నట్టుగా వెల్లడించారు. అయితే ఏమైందో తెలియదు కానీ ఈ మూవీ సంక్రాంతి రేసు నుంచి వెనక్కి తగినట్టుగా వార్తలు వచ్చాయి. అయితే మేకర్స్ మాత్రం ఇప్పటిదాకా ఈ విషయంపై స్పందించనే లేదు. తాజాగా డైరెక్టర్ పరశురాం సినిమాకు సంబంధించిన ఓ విషయంలో అలకబూనినట్టు సమాచారం. అసలేం జరిగిందంటే…

డైరెక్టర్ పరుశురాం ఈ సినిమా కోసం ఎంపిక చేసిన షూటింగ్ లోకేషన్ విషయంలో అసంతృప్తిగా ఉన్నాడట. ఆ లొకేషన్ నచ్చకపోవడంతో, చివరి నిమిషంలో ఫ్లైట్ ఎక్కడానికి నిరాకరించారనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీంతో ‘ఫ్యామిలీ స్టార్’ సమస్యల చుట్టూ తిరుగుతున్నట్టుగా కనిపిస్తోంది. ఇక గతంలోనూ ఈ మూవీకి దిల్ రాజు ప్రొడ్యూసర్ అంటూ అనౌన్స్ చేశాక తీవ్ర దుమారం చెలరేగిన విషయం తెలిసిందే. ఇదివరకు ‘గీత గోవిందం’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న విజయ్ దేవరకొండ, డైరెక్టర్ పరుశురాం కాంబో రిపీట్ కాబోతోందని, ‘ఫ్యామిలీ స్టార్’ అనే టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారంటూ అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చేసింది.

కానీ పరుశురాం ఈ సినిమా చేస్తానంటూ అల్లు అరవింద్ సహా టాలీవుడ్ లోని దాదాపు పది బడా ప్రొడక్షన్ హౌస్ ల చుట్టూ తిరిగి, పలువురు నిర్మాతల దగ్గర అడ్వాన్స్ కూడా తీసేసుకున్నాడట. కానీ అఫీషియల్ అనౌన్స్మెంట్లో మాత్రం నిర్మాత దిల్ రాజు అని ప్రకటించడంతో, మిగతా ప్రొడ్యూసర్స్ అంతా ఫైర్ అయ్యారు. ఇక దిల్ రాజు ఎందుకు వచ్చిన తలనొప్పి అనుకున్నాడో ఏమో తెలియదు గానీ ఈ సినిమాను పక్కన పెట్టేసాడు. ప్రస్తుతం ఈ మూవీని సూర్యదేవర నాగ వంశీ నిర్మిస్తున్నారు.

- Advertisement -

ఇలా ‘ఫ్యామిలీ స్టార్’ అనౌన్స్మెంట్ నుంచే సమస్యల్లో చిక్కుకుంటూ, సినిమాపై పలు అనుమానాలు రేకెత్తిస్తున్నారు. ఇక ఈ వివాదాల కారణంగా సినిమా షూటింగ్ మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. ‘ఫ్యామిలీ స్టార్’ మూవీ గురించి ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న విజయ్ దేవరకొండ అభిమానులు ఈ వివాదాల్లో పడి సినిమాను పక్కన పెట్టేయరు కదా అని ఆందోళన పడుతున్నారు. మరి మేకర్స్ మూవీని ఎప్పుడు కంప్లీట్ చేసి, ఎప్పుడు థియేటర్స్ లోకి తీసుకొస్తారో చూడాలి.

Check out Filmify for the latest Movie updates, New Movie Reviews, Ratings, and all the Entertainment News in Tollywood & Bollywood and all other Film Industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు