Balakrishna: సినీ ఇండస్ట్రీలోకి బాలయ్య వారసురాలు.. సక్సెస్ అవుతుందా..?

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో నందమూరి బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఒకవైపు ఆరుపదుల వయసులో కూడా హ్యాట్రిక్ విజయాలు అందుకుంటూ భారీ బడ్జెట్ సినిమాలు చేస్తూనే..మరొకవైపు రాజకీయంగా కూడా అడుగులు వేస్తూ మరింత క్రేజ్ సొంతం చేసుకున్నారు. అటు సినిమాల పరంగా ఇటు రాజకీయ పరంగా బిజీగా ఉన్న బాలయ్య కు సంబంధించి ఒక వార్త ఇప్పుడు నెట్టింట చాలా వైరల్ గా మారుతుంది. వాస్తవానికి బాలయ్యకు ఇద్దరు కుమార్తెలు, ఒక కొడుకు ఉన్న విషయం తెలిసిందే. ఇక ఆయన కొడుకు మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు. వచ్చే ఏడాది ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నారు మోక్షజ్ఞ..

అయితే మరొకవైపు కుందనపు బొమ్మల్లా ఉండే ఆయన ఇద్దరు కూతుర్లు ఇండస్ట్రీలోకి రావాలని ఎంతో మంది దర్శక నిర్మాతలు కూడా ప్రయత్నం చేసినప్పటికీ బాలయ్య మాత్రం ఈ విషయంపై స్పందించలేదు. దాంతో ఆయన వారసురాలు ఇద్దరు హీరోయిన్గా తమ కెరియర్ మొదలు పెట్టలేకపోయారు. అయితే ఇదిలా ఉండగా తాజాగా ఇప్పుడు బాలయ్య వారసురాలైన చిన్న కూతురు తేజస్విని ఇండస్ట్రీ లోకి రాబోతోంది అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతుంది. అసలు విషయంలోకి వెళ్తే.. బాలయ్య చిన్న కూతురు తేజస్వినికి సినిమాలంటే ఆసక్తి ఎక్కువగా ఉందట.

అందుకే ఆమె హీరోయిన్గా కాకుండా నిర్మాతగా ఇండస్ట్రీలోకి రావాలని ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. అంతేకాదు ఇటీవల బాలయ్య నటించిన భగవంత్ కేసరి సినిమా షూటింగ్ సమయంలో కూడా ఆమె సెట్ లో సందడి చేశారు. పైగా సినిమా షూటింగ్ ఎలా జరుగుతుంది.. సినిమా అవుట్ పుట్ ఎలా వస్తోంది అని అన్ని విషయాలను ఆమె దగ్గరుండి మరి చూసుకున్నారట. అంతేకాదు బాలయ్య పాత్ర పై కూడా ఆమె దృష్టి సారించినట్లు సమాచారం.

- Advertisement -

ఇక ఇప్పుడు నిర్మాతగా త్వరలోనే ఇండస్ట్రీలోకి రావడానికి కథలు వింటున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే ఆమె ఇండస్ట్రీలోకి నిర్మాతగా అడుగుపెట్టే అవకాశం కనిపిస్తుంది. ఇక తేజస్విని గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన తండ్రి బాలకృష్ణ హోస్ట్ గా చేస్తున్న అన్ స్టాపబుల్ విత్ ఎన్బికె కార్యక్రమానికి మూల స్తంభం గా నిలిచి ఆ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా చేసింది తేజస్విని. ఆ విషయంలో సక్సెస్ అయిన ఈమె ఇప్పుడు నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టి ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో అని అభిమానుల సైతం ఆతృతగా ఎవరు చేస్తున్నారు. ఏది ఏమైనా బాలయ్య వారసురాలిగా ఇండస్ట్రీలోకి వచ్చి సక్సెస్ అవ్వాలని బాలయ్య అభిమానులు కోరుకుంటున్నారు.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు