Bala Krishna: చివరికి బాలయ్య కూడా… బాబీ ఏం ప్లాన్ చేస్తున్నాడు?

టాలీవుడ్ లో ప్రస్తుతం ఉన్న సీనియర్ హీరోలలో బాలయ్య మంచి ఫామ్ లో ఉన్నాడు. రీసెంట్ టైంలో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ఇచ్చి నందమూరి అభిమానుల్లో ఫుల్ జోష్ నింపాడు. యంగ్ హీరోలతో పోటీ పడుతూ వరుస సినిమాలు చేస్తున్నాడు. ఇటీవలే అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాలతో హ్యాట్రిక్ కొట్టి, తన కెరీర్ లో మరోసారి సూపర్ సక్సెస్ ను చవిచూశారు. ప్రస్తుతం అదే జోష్ లో తన నెక్స్ట్ మూవీ ని కూడా స్టార్ట్ చేశాడు. బాబి ఈ మూవీకి దర్శకత్వం వహిస్తుండగా, ఇప్పటికే మూవీ షూటింగ్ స్టార్ట్ అయిపోయింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన అప్డేట్ బయటకు వచ్చింది.

ఫిలింనగర్ వర్గాల సమాచారం ప్రకారం ఈ మూవీ మల్టీస్టారర్ గా రూపుదిద్దుకుంటుందట. అందుకోసం బాబి ప్లాన్ వేరే లెవెల్ లో ఉందని సమాచారం. అందుకే ఈ ప్రాజెక్టులోకి ఓ పాన్ ఇండియా స్టార్ ను తీసుకురాబోతున్నారట. తాజా సమాచారం ప్రకారం ఈ మూవీలో బాలయ్యతో పాటు నటించబోతున్న ఆ పాన్ ఇండియా స్టార్ ఎవరంటే దుల్కర్ సల్మాన్.

ఈ మలయాళ సూపర్ స్టార్ ప్రస్తుతం తెలుగు, తమిళ, మలయాళ, హిందీ సినిమాల్లో నటిస్తూ పాన్ ఇండియా స్టార్ క్రేజ్ అందుకుంటున్నారు. తెలుగులో దుల్కర్ మహానటి, సీతారామమం వంటి చిత్రాలతో భారీ సంఖ్యలో అభిమానులను సంపాదించుకున్నాడు. ప్రస్తుతం ఈ యంగ్ హీరో ‘లక్కీ భాస్కర్’ అనే తెలుగు మూవీ లో నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. ఇదిలా ఉండగా బాలయ్య సినిమాలో నటించడానికి దుల్కర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. బాబీ కథతో ఇంప్రెస్ అయిన ఈ యంగ్ హీరో వెంటనే మూవీకి సైన్ చేశాడని సమాచారం.

- Advertisement -

మరి బాలయ్య సినిమాలో దుల్కర్ ఎలాంటి రోల్ చేయబోతున్నాడు అనేది ఆసక్తికరంగా మారింది. నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రను పోషిస్తున్నాడా? లేదా సినిమాలో కీలకమైన పాత్రలో కనిపించనున్నాడా అనే విషయంలో క్లారిటీ లేదు. ఇక త్వరలోనే దుల్కర్ ఈ సినిమా సెట్స్ లో జాయిన్ కానున్నాడు. త్వరలోనే ఈ వార్తను టీం అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. కాగా బాబి గత చిత్రం ‘వాల్తేరు వీరయ్య’ కూడా మల్టీస్టారర్ అన్న విషయం తెలిసిందే.

మెగాస్టార్ చిరంజీవి గ్రేస్, మాస్ మహారాజా రవితేజ ఎనర్జీని ఉపయోగించుకుని మంచి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. ఇప్పుడు కూడా అదే సెంటిమెంట్ ఉపయోగించి ఏదో ప్రయోగం చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. మరి బాబి ఆలోచన ఏంటన్న విషయం త్వరలోనే బయటకు వస్తుందేమో చూడాలి. ఇక ఇవన్నీ పక్కన పెడితే ఇంకా టైటిల్ ఖరారు కాని ఈ సినిమాలో హీరోయిన్ ను కూడా ఫైనల్ చేయాల్సి ఉంది. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తుండగా, బాబీ బాలయ్య చిత్రం 2024 వేసవిలో రిలీజ్ కానుంది.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు