Balakrishna: నందమూరి హీరోని చెప్పుతో కొడతానన్న రాధిక ఆప్టే..!

బోల్డ్ బ్యూటీ రాధిక ఆప్టే అంటే తెలియని సినీ ప్రేక్షకులు ఉండరు. సంచలన నటీమణుల్లో ఈమె ఒకరు. నటుడు ప్రకాష్ రాజ్ స్వీయ దర్శకత్వంలో రూపొందించిన ధోని చిత్రం ద్వారా రాధిక ఆప్టే కోలీవుడ్ కి పరిచయం అయింది. ఆ తరువాత రజినీకాంత్ కథానాయకుడిగా నటించిన కబాలి, కార్తీ సరసన ఆల్ ఇన్ ఆల్ ఆళగురాజా వంటి చిత్రాలలో నటించి ఎంతోమంది ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక తెలుగులో రక్త చరిత్ర, బాలయ్యతో లెజెండ్ వంటి చిత్రాలతో అలరించింది.

ఈ బ్యూటీ గతంలో తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోయిన్లను హీనంగా చూస్తారని చెప్పి వార్తల్లో నిలిచింది. అప్పటినుండి ఈమె తెలుగు సినిమాలకు దూరంగా ఉంది. ఆ తరువాత కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడింది. దక్షిణాదికి చెందిన ఓ నిర్మాత తనని గదిలోకి పిలిచాడని చెప్పి టాక్ ఆఫ్ ది టాలీవుడ్ అయింది. అయితే ఇండస్ట్రీలోని ఓ స్టార్ హీరో పై సంచలన వ్యాఖ్యలు చేసి మరోసారి వార్తలలో నిలిచింది రాధిక ఆప్టే. ఆ హీరో మరెవరో కాదు నందమూరి బాలకృష్ణ. ఇండస్ట్రీలో నందమూరి బాలకృష్ణ ని ఒక్క మాట అనడానికి చాలామంది భయపడుతూ ఉంటారు.

అలాంటిది ఈమె ఏకంగా చెప్పుతో కొడతానని వార్నింగ్ ఇచ్చిందట. ఇందుకు కారణం ఏంటంటే.. ఆమధ్య ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన రాధిక.. ” నేను తెలుగు సినిమాలో చేస్తున్న సమయంలో ఓ స్టార్ హీరో నాతో కాస్త అసభ్యంగా ప్రవర్తించారు. ఆయన తీరు నాకు నచ్చలేదు. దీంతో ఆయనని చెప్పుతో కొడతానని గట్టిగా వార్నింగ్ ఇచ్చాను” అని చెప్పుకొచ్చింది. దీంతో ఆమె ఇప్పటివరకు టాలీవుడ్ లో చేసిన స్టార్ హీరో కేవలం బాలకృష్ణనే. ఇక ఆమె చెప్పుతో కొడతానని వార్నింగ్ ఇచ్చింది కూడా ఆయనకే కావచ్చు అని కొంతమంది అభిమానులు ఈ విషయంలో కోపంతో ఊగిపోయారు. మరి ఆమె మాట్లాడింది బాలకృష్ణని ఉద్దేశించేనా..? లేదా అనేది మాత్రం క్లారిటీ లేదు.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు