Balakrishna: భగవంత్ కేసరి బిజినెస్ లెక్కలు ఇప్పుడెందుకు చెప్పినట్టు!

టాలీవుడ్ లో ఈ దసరా కి మూడు బడా పిక్చర్స్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. అందులో నందమూరి బాలకృష్ణ నటించిన “భగవంత్ కేసరి” కూడా ఒకటి. రవితేజ, విజయ్ సినిమాలకి పోటీ గా రిలీజ్ అయిన బాలయ్య సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మిశ్రమ స్పందన ని తెచ్చుకోగా, ఓపెనింగ్స్ పరంగా సూపర్ కలెక్షన్లు సాధించింది. పైగా పోటీగా వచ్చిన టైగర్ నాగేశ్వరరావు సినిమా అంతగా ఆకట్టుకోలేకపోవడంతో, భగవంత్ కేసరి కి అడ్వాంటేజ్ అయింది.

అయితే ఈ సినిమా ఇప్పటివరకు పూర్తిగా బ్రేక్ ఈవెన్ కాలేదు. కానీ తాజాగా మూవీ మేకర్స్ ఫస్ట్ టైం బిజినెస్ తో పాటు, బ్రేక్ ఈవెన్ లెక్కలు కూడా చెప్తూ పోస్టర్స్ రిలీజ్ చేసారు.

అయితే అసలు విషయానికొస్తే భగవంత్ కేసరి పండగ సెలవులను క్యాష్ చేసుకున్నా, ఆ తర్వాత లాంగ్ రన్ లో నిలబడలేకపోయింది. బిజినెస్ పరంగా పూర్తిగా బ్రేక్ ఈవెన్ కాలేదు 67 కోట్లకి పైగా బిజినెస్ చేసిన ఈ సినిమా ఇప్పటివరకు 66 కోట్ల షేర్ సాధించగా బ్రేక్ ఈవెన్ కి కొద్దీ దూరంలో ఉంది.

- Advertisement -

కానీ లేటెస్ట్ గా మేకర్స్ తెలిపిన వివరాల ప్రకారం కేవలం 57 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ మాత్రమే జరిగిందని 70 కోట్లకి పైగా షేర్ వసూలు చేసిందని, 13 కోట్లకి పైగా ప్రాఫిట్స్ తో బ్లాక్ బస్టర్ అయిందని పోస్టర్స్ లో చెప్పారు. అయితే ఈ విషయంపై సోషల్ మీడియా లో ట్రోల్స్ మొదలయ్యాయి. ఇవి తప్పుడు లెక్కలని ఇతర హీరోల ఫ్యాన్స్ ట్రోల్ చేస్తుంటే, నందమూరి ఫ్యాన్స్ సమర్ధిస్తూ, ప్రొడ్యూసర్స్ ఓన్ రిలీజ్ చేసారు కాబట్టి, బిజినెస్ అప్డేట్ చేసి చెప్పారు అని వాదిస్తున్నారు.

ఇక గతంలో లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన చిరంజీవి గాడ్ ఫాదర్ కి కూడా ఇదే సమస్య ఎదురైందన్న సంగతి తెలిసిందే.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు