Bhagavanth Kesari: విగ్గు పెట్టుకుంటారా అన్న ఎదవకు చెప్తున్నా..బాలకృష్ణ కామెంట్స్

 

నటసింహం నందమూరి బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తెలుగులో రెండో తరం టాప్ హీరోల్లో ఒకడిగా, నందమూరి నటవారసుడిగా, సినిమాలు చేస్తూ అభిమానుల్ని అలరిస్తున్న బాలయ్య ఇప్పుడు ఫుల్ జోష్ లో ఉన్నాడు. లాక్ డౌన్ తర్వాత బాలకృష్ణ 2.0 గా వచ్చి అన్ స్టాపబుల్ ఎంటెర్టైన్మెంట్ తో అలరిస్తున్నాడు. రెండేళ్ల కిందట అఖండ తో బ్లాక్ బస్టర్ కొట్టిన బాలయ్య, ఈ ఇయర్ వీరసింహారెడ్డి గా వచ్చి మరో సూపర్ హిట్ కొట్టాడు. ఇక ఇప్పుడు దసరాకి భగవంత్ కేసరిగా హ్యాట్రిక్ హిట్ కొట్టడానికి వస్తున్నాడు.

అయితే బాలకృష్ణ ముక్కుసూటితనం గురించి అందరికి తెలిసిందే. సినిమాల్లో అయినా, ఈవెంట్స్ లో అయినా, ఫ్యాన్స్ తో అయినా ఒకేలా ఉంటారు. ఎవరైనా హద్దు మీరితే దెబ్బలు కూడా పడతాయి. అటు వైపు ఎవరున్నా సరే.. తగ్గేదిలేదంటాడు. అయితే బాలయ్య ని మనసుతో చూసిన వాళ్ళు అర్ధం చేసుకుంటారని ఫ్యాన్స్ కూడా అంటూ ఉంటారు.

- Advertisement -

ఇక లేటెస్ట్ గా భగవంత్ కేసరి ప్రెస్ మీట్ లో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. బాలయ్య మాట్లాడుతూ “పలానా సందర్భంలో “ఒక వెదవ మీరు విగ్గు పెట్టుకుంటారా” అని అడిగాడు. అప్పుడు నేను అవునయ్యా నేను విగ్గు పెట్టుకుంటా.. నువ్వేం పీక్కోని గడ్డం పెట్టుకున్నావా.. అని అడిగానన్నాడు. ఓపెన్ బుక్ మనమంతా.. ఎవడికి భయపడేదే లే.. వాడికి చెప్తున్నా మళ్ళీ అంటూ స్ట్రాంగ్ కౌంటర్ వేసాడు.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు