Balakrishna: నేలకొండ ‘భగవంత్ కేసరి’… బిడ్డ కోసం..

Balakrishna:

నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బాలకృష్ణ కొత్త సినిమా “భగవంత్ కేసరి” థియేట్రికల్ ట్రైలర్ వచ్చేసింది. బాలకృష్ణ హీరోగా నటించిన ఈ సినిమాను అనిల్ రావిపూడి డైరెక్ట్ చేశాడన్న సంగతి తెలిసిందే. ఇంతకు ముందు రిలీజ్ అయిన టీజర్ ద్వారా మంచి బజ్ తీసుకొచ్చిన ఈ సినిమా తాజాగా ట్రైలర్ రిలీజ్ తో అంతకు మించిన మాస్ హైప్ తీసుకొచ్చింది.

వరంగల్ లోని హన్మకొండ లో యూనివర్సిటీ ఆర్ట్స్& సైన్స్ కాలేజ్ లో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో రిలీజ్ చేయగా, ఈ ఈవెంట్ కి బాలయ్య ఇంకా చిత్ర యూనిట్ తో పాటు పలువురు దర్శకులు గెస్ట్ లుగా హాజరయ్యారు.

ఇక ట్రైలర్ విషయానికి వస్తే ట్రైలర్ లో ఆల్మోస్ట్ కథ చెప్పేసాడు డైరెక్టర్. తన కూతుర్ని ఆర్మీకి పంపాలన్న లక్ష్యంతో హైదరాబాద్ కి వచ్చి బిడ్డకి ట్రైనింగ్ ఇస్తూ ఉంటాడు. అయితే తండ్రి ఇచ్చే ట్రైనింగ్, ఇంకా పనిష్మెంట్ లకు తట్టుకోలేక తన వల్ల కాదంటుంది. అయినా తన ప్రయత్నం ఆపడు. ఈ క్రమంలో అనుకోకుండా విలన్ గ్యాంగ్ హీరోకి ఎదురొచ్చి తన బిడ్డ జోలికి వెళ్తాడు. అప్పుడు భగవంత్ కేసరి తన కూతురికోసం ఏం చేసాడు అన్నదే కాన్సెప్ట్ గా ట్రైలర్ లో చెప్పడం జరిగింది.

- Advertisement -

ఇక ట్రైలర్ క్వాలిటీ చాలా బాగుండడమే గాక, బిజిఎమ్ కూడా బాగుంది. ట్రైలర్ లో బాలయ్య చెప్పే డైలాగ్స్ ని బట్టి తెలంగాణ మాండలికాన్ని బాగా ఓన్ చేసుకుని చెప్పాడని తెలుస్తుంది. ఇక నిర్మాణ విలువలు కూడా రిచ్ గా ఉన్నాయి. ట్రైలర్ లో కాజల్ కి ఎక్కువ స్క్రీన్ స్పేస్ దక్కలేదు. ఓ రకంగా కాజల్ కంటే శ్రీ లీలకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారని తెలుస్తుంది. ఫైనల్ గా ఈ దసరా కి భగవంత్ కేసరి సౌండ్ గట్టిగా ఉండనుందని డైరెక్టర్ అనిల్ రావిపూడి ట్రైలర్ ద్వారా చెప్పేసాడు.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు