NBK108: బాలయ్య చిత్రానికి ఈ పవర్ఫుల్ టైటిల్?

నందమూరి బాలకృష్ణ వరుస హిట్లతో దూసుకుపోతున్నాడు. కొన్నేళ్ళకిందట హిట్ స్టేటస్ పరంగా, మార్కెట్ పరంగా చాలా డౌన్ అయిన బాలయ్య బోయపాటితో చేసిన అఖండ ద్వారా మళ్ళీ తన బాక్స్ ఆఫీస్ స్టామినా చూపించాడు. ఆ తర్వాత సంక్రాంతికి వీర సింహారెడ్డిగా వచ్చి మరో సూపర్ హిట్ కొట్టిన బాలయ్య వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ జోష్ మీదున్నాడు. ప్రస్తుతం అనిల్ రావిపూడి తో తన 108వ చిత్రం చేస్తున్నాడని అందరికి తెలిసిందే.

ఈ సినిమాను షైన్ స్క్రీన్ బ్యానర్ లో సాహు గారపాటి, హరీష్ పెద్ది సంయుక్తంగా నిర్మిస్తున్నారు.గ్యాప్ లేకుండా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను దసరా కానుకగా అక్టోబర్ లో విడుదల చేయాలనీ ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ నటిస్తుండగా, మరో ప్రత్యేక పాత్రలో శ్రీలీల నటిస్తుంది. ఆ మధ్య చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన బాలయ్య ఫస్ట్ లుక్స్ కూడా అదిరిపోయాయి. ఇక చిత్ర యూనిట్ నుంచి తాజాగా ఒక సమాచారం బయటికి వచ్చింది.

ఈ సినిమా కోసం ఒక పవర్ ఫుల్ టైటిల్ ని డైరెక్టర్ అనిల్ రావిపూడి ఫిక్స్ చేసినట్లుగా సమాచారం వచ్చింది. ఆ టైటిలే “భగవత్ కేసరి”. ఎంతో పవర్ ఫుల్ గా ఉన్న టైటిల్ బాలయ్యకి మాత్రం చాలా కొత్తగా ఉంటుంది. ఇక ఈ టైటిల్ ను రేపు అనగా జూన్8న అధికారికంగా ప్రకటించబోతున్నారని చిత్ర యూనిట్ నుంచి సమాచారం అందింది. ఇంతకు ఇలాంటి టైటిల్స్ బాలకృష్ణ సినిమాలకు పెట్టకపోవడంతో ఈ సినిమాకు భగవత్ కేసరి అన్న టైటిల్ చాల బాగుంటుందని తమ బాలయ్యకి భలే సూట్ అవుతుందని అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు