Nagarjuna: బిగ్ బాస్ సూపర్ ట్విస్ట్? సీక్రెట్ రూమ్ ఓపెన్?

Nagarjuna:

స్టార్ మా లో బిగ్ బాస్ సీజన్ 7 ఐదు వారాలు కంప్లీట్ అవగా, ఈ వారం ఎలిమినేషన్ షాకింగ్ ట్విస్ట్ లతో సాగింది. ట్విస్ట్ లు అనడం కన్నా సూపర్ ఎంటర్టైనింగ్ గా షో సాగుతుందనవచ్చు. ఎందుకంటే ప్రతివారం ఎలిమినేషన్ లో ఒక్క కంటెస్టెంటే ఎలిమినేట్ అవగా, ఈ సారి ఇద్దరు కంటెస్టెంట్ లను ఎలిమినేట్ చేస్తున్నామని నాగార్జున చెప్పడం జరిగింది. ఇక ఫస్ట్ ఎలిమినేషన్ గా శుభ శ్రీ వెళ్లిపోగా, రెండో ఎలిమినేట్ గా గౌతమ్ ని పంపిస్తున్నామంటూ నాగార్జున హౌస్ మేట్స్ కి చెప్పడం జరిగింది.

కానీ అంతలోనే షాకింగ్ ట్విస్ట్ ఇచ్చాడు కింగ్ నాగ్. గౌతమ్ ని ఇంకొక అవకాశం ఇస్తున్నామని ఎలిమినేట్ చేయడం లేదని చెప్పారు. కానీ హౌస్ లోకి పంపకుండా సీక్రెట్ రూమ్ లోకి పంపిస్తున్నామంటూ చెప్పారు. ఇది విన్న తర్వాత గౌతమ్ చాలా హ్యాపి గా ఫీల్ అవుతూ, ఇది నా రీ బర్త్ గా ఫీల్ అవుతున్నానంటూ, తనని తాను ప్రూవ్ చేసుకునే అవకాశం మరో అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్పాడు.

ఇక నాగార్జున బిగ్ బాస్ సీక్రెట్ రూం కి వెళ్ళమని, అక్కడ ఏం చేయాలో, ఎలా ఉండాలో బిగ్ బాస్ ఆదేశాలిస్తాడని చెప్పారు. కానీ ఎప్పుడు హౌస్ లోకి వెళ్లాలో బిగ్ బాస్ మాత్రమే చెప్తాడని అన్నారు. అయితే ఇలా కంటెస్టెంట్స్ ని సీక్రెట్ రూమ్ కి పంపించడం ఇదే తొలిసారి కాదు, గత సీజన్లో రాహుల్ సిప్లిగంజ్ ని కూడా ఇలాగే సీక్రెట్ రూమ్ కి పంపించడం జరిగింది.

- Advertisement -

ఇక ఈ సీజన్లో ఈ ఎపిసోడ్ చాలా హైలెట్ అయిందని చెప్పొచ్చు. బిగ్ బాస్ ఇచ్చిన ఈ ట్విస్ట్ తో TRP రేటింగ్స్ ఓ రేంజ్ లో వస్తుందని అనిపిస్తుంది. మరి ముందు ముందు బిగ్ బాస్ ఇంకెంత ఇంట్రెస్టింగ్ గా సాగుతుందో చూడాలి.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the

Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు