Ramcharan: ‘గేమ్ ఛేంజర్’ విషయంలో ఆ రోజు క్లారిటీ వచ్చే ఛాన్స్!

టాలీవుడ్ లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా సినిమాల్లో “గేమ్ ఛేంజర్” కూడా ఒకటి. శంకర్ షణ్ముగం దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. శంకర్ చాలా ఏళ్ళ తర్వాత పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిస్తున్న సినిమా అందులోనూ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కి పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో ఫస్ట్ మూవీ అవడం వల్ల, చరణ్ ఫ్యాన్స్ తో పాటు కామన్ ఆడియన్స్ లో కూడా ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.

దీనికి తోడు సినిమా లీక్డ్ స్టిల్స్ లో రామ్ చరణ్ అదిరిపోయాడు. అయితే ఇప్పటివరకు ఈ సినిమా నుండి టైటిల్ అనౌన్స్ మెంట్, ఫస్ట్ లుక్ పోస్టర్ మినహా మరే అప్డేట్ కూడా రాలేదు. అయితే తాజాగా గేమ్ ఛేంజర్ నుండి ఫస్ట్ సాంగ్ దీపావళి కి రిలీజ్ చేస్తున్నట్టు మేకర్స్ తెలియచేయడం జరిగింది. ‘జరగండి’ అనే పేరుతో రిలీజ్ చేస్తున్న ఆ సాంగ్ శంకర్ మార్క్ లో ఉండబోతుందని రిలీజ్ అయిన స్టిల్స్ నుండే తెలిసిపోతుంది.

ఇదిలా ఉండగా గేమ్ ఛేంజర్ రిలీజ్ డేట్ పై మాత్రం ఇంకా కంఫ్యూషన్ లోనే ఉన్నారు ఫ్యాన్స్. ఎందుకంటే గేమ్ ఛేంజర్ రిలీజ్ 2024 సమ్మర్ లో ఉంటుందని మేకర్స్ చెప్తూ వస్తున్నా, శంకర్ ఇండియన్2 పై ద్రుష్టి పెట్టడంతో ఫ్యాన్స్ గేమ్ ఛేంజర్ విషయంలో అనుమాన పడుతున్నారు.

- Advertisement -

అయితే ట్రేడ్ పండితుల అంచనా ప్రకారం గేమ్ ఛేంజర్ ఫస్ట్ సాంగ్ రిలీజ్ అవుతున్న దాంట్లోనే, రిలీజ్ డేట్ ని కూడా అనౌన్స్ చేస్తారని టాక్ నడుస్తుంది. ఇది నిజమో కాదో తెలీదు కానీ, రిలీజ్ డేట్ పై దివాళి రోజే ఎదో ఒక విషయం చెప్తే, చరణ్ ఫ్యాన్స్ కూడా ఓ క్లారిటీ ఉంటుందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు