Harish Shankar: ఉస్తాద్ కి బ్రేక్… మహారాజా ఆన్ ట్రాక్

షాప్ సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు హరీష్ శంకర్. కానీ ఆ సినిమా హరీష్ శంకర్ కి షాక్ ఇచ్చింది. 2006లో వచ్చిన షాక్ సినిమా తర్వాత మళ్లీ దర్శకుడుగా తనను తాను ప్రూవ్ చేసుకోవడానికి ఐదేళ్లు వెయిట్ చేయాల్సి వచ్చింది హరీష్ శంకర్ కి. 2011 లో వచ్చిన మిరపకాయ సినిమాతో దర్శకుడుగా హరీష్ శంకర్ తనను తాను ప్రూవ్ చేసుకున్నాడు.

మిరపకాయ్ సినిమా తర్వాత హరీష్ శంకర్ చేసిన సినిమా గబ్బర్ సింగ్. హరీష్ శంకర్ అంటే ఇప్పటికీ ఎప్పటికీ గుర్తొచ్చే ఏకైక సినిమా గబ్బర్ సింగ్. ఎందుకంటే గబ్బర్ సింగ్ సినిమా ఇండస్ట్రీ పైన క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అలాంటిది. దాదాపు పదిఏళ్ళు హిట్ లేని పవన్ కళ్యాణ్ కెరియర్ కి బీభత్సమైన హిట్ అందుకుని ఆల్ టైం రికార్డ్ గా నిలిచింది.

గబ్బర్ సింగ్ సినిమాతో పవన్ కళ్యాణ్ ని ఒక సగటు అభిమాని ఎలా చూడాలనుకుంటున్నాడో అలా చూపించాడు. ఆ సినిమాతో హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ లో ఎప్పటినుంచో మిస్ అవుతున్న జోష్ బయటికి తీశాడు. హరీష్ శంకర్ ఆ సినిమా తర్వాత చేసిన రామయ్య వస్తావయ్య సినిమా ఊహించిన ఫలితాన్ని ఇవ్వలేదు. సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ పర్వాలేదు అనిపించుకుంది. దువ్వాడ జగన్నాథం సినిమా కూడా ఓకే అనిపించుకుంది.

- Advertisement -

ప్రస్తుతం హరీష్ శంకర్, పవన్ కళ్యాణ్ తో చేస్తున్న సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. ఈ సినిమా షూటింగ్ కూడా ఒక 20 రోజులు జరిగింది ఈ సినిమా నుంచి ఇదివరకే రిలీజ్ అయిన గ్లిమ్ప్స్ కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సినిమాపై అంచనాలను భారీగా పెంచేసింది. అయితే ప్రస్తుతం వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకి బ్రేకులు పడినట్లు తెలుస్తున్నాయి. ఇప్పుడు ఈ గ్యాప్ లో హరీష్ శంకర్ మళ్లీ రవితేజతో సినిమా చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. జనవరి నుంచి ఈ సినిమాషూటింగ్ స్టార్ట్ కానున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇది ఎంతవరకు వాస్తవం అనేది అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చినంత వరకు వేచి చూడక తప్పదు.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు