Ustaad Bhagat Singh: గబ్బర్ సింగ్ సెంటిమెంట్ ని మర్చిపోయిన హరీష్ శంకర్..!

Ustaad Bhagat Singh

డైరెక్టర్ హరీష్ శంకర్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ,మొదలై చాలా కాలం అవుతున్నప్పటికీ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉండటం వల్ల షూటింగ్ డిలే అవుతూ వస్తోంది. ఇప్పటికి ఈ సినిమా హెషూటింగ్ 40శాతం వరకు పూర్తయ్యిందని సమాచారం అందుతోంది.
ఇదిలా ఉండగా గబ్బర్ సింగ్ విషయంలో ఫాలో అయిన సెంటిమెంట్ ని ఈ సినిమా విషయంలో డైరెక్టర్ హరీష్ శంకర్ మర్చిపోయాడని అనిపిస్తోంది. ఆ సినిమా మొదలైన సమయానికి హీరోయిన్ శృతి హాసన్ వరుస ఫ్లాప్స్ తో ఉండేది. ప్రొడ్యూసర్ ఫ్లాప్స్ లో ఉన్న హీరోయిన్ అవసరమా అని వారించగా, నేను హిట్, ఫ్లాప్ తో సంబంధం లేకుండా ట్యాలెంట్ ని మాత్రమే నమ్ముతానని చెప్పి హీరోయిన్ గా శ్రుతిని ఒప్పించాడట.
అయితే, ఉస్తాద్ భగత్ సింగ్ కోసం శ్రీలీలను ఫస్ట్ హీరోయిన్ గా, ఏజెంట్ హీరోయిన్ సాక్షి వైద్యను అనుకున్నారు మొదట్లో. అయితే, తాజాగా సాక్షి వైద్యను ఈ సినిమా నుండి తప్పించారని టాక్ వినిపిస్తోంది. సాక్షికి వరుసగా ఏజెంట్, గాండీవదారి అర్జున వంటి ఫ్లాప్స్ ఉండటమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. అప్పట్లో వరుస ఫ్లాప్స్ తో ఉన్నప్పటికీ శృతి హాసన్ ని హీరోయిన్ గా తీసుకున్న హరీష్ ఇప్పుడు సాక్షిని తప్పించటం ఏంటని కామెంట్ చేస్తున్నరు నెటిజన్స్.
ఉస్తాద్ భగత్ సింగ్ సంబందించిన గ్లిమ్ప్స్ ఇప్పటికే విడుదలై సినిమా మీద అంచనాలు పెంచిన నేపథ్యంలో ఫ్యాన్స్ సహా నార్మల్ ఆడియెన్స్ కూడా ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. చాలా కాలం తర్వాత హరీష్ శంకర్, పవన్ కళ్యాణ్, దేవిశ్రీప్రసాద్ ల కాంబినేషన్ ఈ సినిమాతో రిపీట్ అవుతున్న నేపథ్యంలో ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. మరి, ఇంకా రిలీజ్ డేట్ ఫిక్స్ కానీ ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో చూడాలి.
Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు