Rajinikanth:171కి రజిని రెమ్యునరేషన్… ఇది ఆసియాలోనే అత్యధికం?

సూపర్ స్టార్ అనే ట్యాగ్ సరిగ్గా సెట్ అయ్య హీరో రజినీకాంత్. అయితే ఈ సూపర్ స్టార్ కొన్ని రోజుల క్రితం ఒక మామూలు హిట్ మూవీ చేయడానికి కూడా చాలా కష్టపడ్డాడు. 2.o తర్వాత వచ్చిన మూడు సినిమాలు కూడా డిజాస్టార్ అయ్యాయి. 2.o కి ముందు కూడా రిజినీకాంత్ కి చాలా డిజాస్టార్ సినిమాలు ఉన్నాయి. అలాంటి సమయంలో రజినీ కాంత్ కెరీర్ ని నెలబెట్టిన సినిమా జైలర్. ఈ సినిమా 600 కోట్లు కొల్లగొట్టి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. అంతే కాదు, 600 కోట్లు వసూళ్లు చేసిన తొలి తమిళ హీరోగా రజినీకాంత్ నిలిచాడు.

జైలర్ తర్వాత రజినీకాంత్ తలైవార్ 171 అనే వర్కింగ్ టైటిల్ తో లోకేష్ కనగరాజ్ తో సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే అధికారిక ప్రకటన వచ్చింది. త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనున్న ఈ సినిమా గురించి ఓ ఆసక్తికరమైన వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ సినిమాలో రజినీకాంత్ రెమ్యునరేషన్ భారీగా ఉంటుందని తెలుస్తుంది. నిజానికి ఇప్పటికే రజినీకాంత్ సౌత్ లోనే అత్యధికంగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు. కానీ, ఇప్పుడు పారితోషికం విషయంలో ఆసియా రేంజ్ వరకు రజినీ వెళ్లాడని సమాచారం.

Read More:Rajinikanth: ఆ దేశంలో హైయెస్ట్ గ్రాసింగ్ మూవీ గా జైలర్?

తలైవార్ 171 కి రజినీ కాంత్ ఏకంగా 260 కోట్ల నుంచి 280 కోట్ల మధ్య వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని కోలీవుడ్ వర్గాల్లో వినిపిస్తుంది. ఇంత మొత్తం పారితోషికం ఇవ్వడానికి నిర్మాతలు సన్ పిక్ఛర్స్ కూడా ఏ మాత్రం ఆలోచించలేదట. నిజానికి బాక్సాఫీస్ వద్ద జైలర్ ఫలితాన్ని చూసిన తర్వాత రజినీకాంత్ కు ఇంత పెద్ద మొత్తంలో రెమ్యునరేషన్ ఇవ్వడంలో తప్పు లేదని అనిపించొచ్చు. అలాగే డైరెక్టర్ లోకేష్ కరగరాజ్ కూడా మిక్సిడ్ టాక్ వచ్చిన లియోకి 500 కోట్ల కలెక్షన్లు తెప్పించాడు. ఇక ఇద్దరి కాంబినేషన్ లో సినిమా అంటే… అంచనాలు ఎక్కువే ఉంటాయి. అందుకే రజినీకాంత్ రెమ్యునరేషన్ విషయంలో నిర్మాతలు సన్ పిక్చర్స్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది.
Filmify gives an interesting update on celebrities in Tollywood & Bollywood and other industries. Also provides new movie release dates & updates, Telugu cinema gossip, and other Movies news, etc.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు