Telugu Heroes: తమిళ్ తమ్ముళ్లకు తెలుగోళ్లు అక్కర్లేదా?

కమల్ హాసన్ బర్త్ డే సందర్భంగా థగ్ లైఫ్ మూవీ నుంచి ఓ వీడియో వచ్చింది. ఇది కేవలం తమిళ ఆడియన్స్‌ను మాత్రమే కాదు… తెలుగు, సౌత్‌తో పాటు నార్త్ ఆడియన్స్ ను కూడా ఇంప్రెస్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్ ఉంది. ఈ వీడియోలో టైటిల్‌ని రివీల్ చేయడం తో పాటు, కమల్ హాసన్ లుక్ అండ్ పాత్ర పేరును అనౌన్స్ చేశారు.
అలాగే సినిమాలో కీలక పాత్రలు చేస్తున్న వారి పేర్లను కూడా ప్రకటించారు.

Read More:Thug Life: అతని పేరు రంగరాయ సత్తివేళ్ ‘నాయగన్’… గుర్తుంచుకోండి!

దీని ప్రకారం.. థగ్ లైఫ్ లో తమిళ హీరో జయం రవి, మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ నటిస్తున్నట్టు పోస్టర్ లో రివీల్ చేశారు. ఇదే కమల్ హాసన్ చేస్తున్న ఇండియన్ 2 లో కూడా కీలక పాత్రలో తమిళ హీరో సిద్ధార్థ్ తో పాటు ఎస్ జే సూర్య కనిపించబోతున్నారు. ఇటీవల కమల్ హాసన్ హీరోగా వచ్చిన విక్రమ్ సినిమాలో తమిళ హీరో విజయ్ సేతుపతి, మలయాళ హీరో ఫహద్ ఫజిల్ కనిపించారు. అలాగే నెల్సాన్ – రజినీకాంత్ కాంబోలో వచ్చిన జైలర్ సినిమాలో కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్, మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ గెస్ట్ పాత్రల్లో మెరిశారు. ఇలా తమిళంలో ఉన్న స్టార్ హీరోలు తమ సినిమాల్లో గెస్ట్ పాత్రల కోసం… తెలుగు హీరోలను మినహా మిగితా ఇండస్ట్రీకి చెందిన వారినే తీసుకుంటున్నారు.

- Advertisement -

నిజానికి ప్రస్తుతం సినిమా స్థాయి విస్తరించింది. ఇప్పుడు భాషా సరిహద్దులు లేవు. ఇది అందరూ ఒప్పుకుంటున్న నిజం. అయితే సినిమాల విషయానికి వస్తే.. మాత్రం తమ భాషలో ఉన్న వాళ్లకే ఫస్ట్ ప్రియారిటీ ఇస్తున్నారు. గతంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇదే కోలీవుడ్ గురించి చేసిన వ్యాఖ్యలు మనం విన్నాం. ఇప్పుడు గత కొన్ని సినిమాలు చూస్తే.. ఇది నిజమే అనే ఫీలింగ్ వస్తుంది.

Read More:Kamal Haasan: థగ్ లైఫ్ సీక్వెల్ మూవీనే… ఇదిగో ప్రూవ్!

అయితే తమిళం వారికి కాస్త భాషా, ప్రాంతీయ అభిమానం, ఎక్కువ. కానీ, అవి రాజకీయంగా చూడాలే తప్పా.. భాషలతో సంబంధం లేకుండా అందరూ ఆదరించే సినిమాలా విషయంలో ఇలాంటివి ఉండొద్దు అని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఇలాంటివి విన్న తర్వాత.. మరో విషయం చర్చకు వస్తుంది. రజినీకాంత్.. నుంచి రాబోతున్న తలైవార్ 170లో బాలీవుడ్ హీరో అమితాబ్ బచ్చన్, మలయాళ హీరో ఫహద్ ఫజిల్ తో పాటు తెలుగు హీరో రానా దగ్గుబాటిని తీసుకున్నారు కదా… అని పలువురు అంటున్నారు. అయితే పైనా చెప్పిన థగ్ లైఫ్, ఇండియన్ 2, విక్రమ్, జైలర్ సినిమాల్లో ఛాన్స్ ఉన్నా.. తెలుగు నటులకు ఎందుకు ఛాన్స్ ఇవ్వలేదు అంటూ మరో ప్రశ్న వస్తుంది. ఐదు సినిమాల్లో కేవలం ఒక్క సినిమాల్లోనే తెలుగు హీరో కనిపిస్తున్నాడని, మిగితా సినిమాలను గమనిస్తే.. తమిళ్ తమ్ముళ్ల ప్రియారిటీ ఏంటో అర్థమవుతుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Filmify gives an interesting update on celebrities in Tollywood & Bollywood and other industries. Also provides new movie release dates & updates, Telugu cinema gossip, and other Movies news, etc

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు