Anushka Shetty: పుట్టినరోజు శుభాకాంక్షలు సుభా

పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన సూపర్ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది అనుష్క శెట్టి. తన బ్యూటీ తో ఎంతోమందిని పడేసింది ఈ స్వీటీ. దాదాపుగా స్టార్ హీరోస్ అందరితోనూ జత కట్టి తన కంటూ ఒక ప్రత్యేకమైన ఫ్యాన్స్ ను సాధించుకుంది. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన విక్రమార్కుడు సినిమాతో రవితేజ సరసన నటించి మంచి గుర్తింపును సాధించింది.

Read More:Miss Shetty Mr Polishetty: స్వీటీ బయటకు వచ్చింది

విక్రమార్కుడు సినిమాతో అనుష్క ను అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. చిరంజీవి,నాగార్జున,వెంకటేష్ లాంటి హీరోలతో చేసిన తరువాత వచ్చిన “అరుంధతి” సినిమా అనుష్క కి ఇప్పటికి కెరియర్ బెస్ట్.
ఆ తరువాత ఎన్నో హిట్ సినిమాలు అనుష్క కెరియర్ లో వచ్చినా, మిర్చి సినిమా మాత్రం మంచి పేరు తీసుకొచ్చింది. ఆ తరువాత వచ్చిన రుద్రమదేవి,భాగమతి,బాహుబలి సినిమాలు అనుష్క కెరియర్ లో ఇప్పటికి బెస్ట్,

- Advertisement -

2005 లో మొదలైన అనుష్క ప్రయాణం అద్భుతంగా సాగిందని చెప్పొచ్చు. రీసెంట్ గా నవీన్ పోలిశెట్టి సరసన నటించి “మిస్ శెట్టి , మిస్టర్ పోలిశెట్టి” సినిమాతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది అనుష్క.
ఈ సినిమాకి మంచి ప్రశంసలు తో పాటు , అద్భుతమైన కలక్షన్స్ కూడా వచ్చాయి. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న మల్లిడి వసిస్ట్ దర్శకత్వం వహిస్తున్న “విశ్వంభర” సినిమాలో అనుష్క నటిస్తున్నట్లు వార్తలు వినిపించాయి.

Read More:Miss Shetty Mister Polishetty: నాలుగురోజుల్లో టార్గెట్ ఔట్.. ఇకపై బయ్యర్లకి పండగే!

అలానే భాగమతి సినిమాకి సీక్వెల్ గా రానున్న భాగమతి -2 సినిమాలో అనుష్క నటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ భాగమతి -2 సినిమా చేస్తే ఇది అనుష్క కెరియర్ లో 50వ సినిమా అవుతుంది.
ఇలానే మంచి ప్రాజెక్ట్స్ చేస్తూ తెలుగు ప్రేక్షకులను అలరించాలని కోరుకుంటూ Filmify.in తరుపు నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు ఖలేజా సుభాషిణి.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు