Miss Shetty Mr Polishetty: స్వీటీ బయటకు వచ్చింది

Miss Shetty Mr Polishetty:

రీసెంట్ టైమ్స్ లో జవాన్ ప్రభంజనాన్ని తట్టుకుని మరి మంచి విజయం సాధించిన సినిమా “మిస్టర్ శెట్టి మిసెస్ పోలిశెట్టి“. నవీన్ పోలిశెట్టి, అనుష్క శెట్టి జంటగా నటించిన ఈ సినిమాను మహేష్ బాబు తెరకెక్కించాడు. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ నిర్మించింది. నవీన్ పోలిశెట్టి ఈ సినిమా ప్రొమోషన్స్ లో చాలా యాక్టివ్ గా కనిపించాడు. కానీ అనుష్క మాత్రం ప్రమోషన్స్ లో కనిపించలేదు.

ఈ సినిమా ప్రొమోషన్స్ లో భాగంగా నవీన్ పోలిశెట్టి విజయవాడ, గుంటూరు , హైదరాబాద్ మాత్రమే కాకుండా అమెరికా వరకు వెళ్లి ఈ సినిమాను ప్రోమోట్ చేసాడు. “మిస్టర్ శెట్టి మిసెస్ పోలిశెట్టి” సినిమా ప్రెస్ మీట్స్ లో , ఇంటర్వ్యూస్ లో అనుష్క కనిపించకపోవడం తో అనుష్క ఎక్కడ అని చాలా ప్రశ్నలు ఎదుర్కొన్నాడు నవీన్. సినిమా టీం తో విబేధాలు వచ్చి అని కూడా కొన్ని కథనాలు వినిపించాయి.

ఎట్టకేలకు ఈ సినిమా హిట్ ఐన తరుణంలో అనుష్క శెట్టి ఒక వీడియోను రిలీజ్ చేసి ఆడియన్స్ కి కృతజ్ఞతలు తెలిపింది. అలానే విమెన్ కోసం గురువారం నాడు తెలంగాణ మరియు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలలో స్పెషల్ మార్నింగ్ షోస్ ను ప్రదర్శించనున్నట్లు అనుష్క చెప్పుకొచ్చింది.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు