Rules Ranjann: ఈ వాయిదాల పర్వం ఎన్ని రోజులు?

Rules Ranjann:

టాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ, వరుస ప్లాపులు కూడా ఎదుర్కొంటూ హిట్ కోసం తపిస్తున్న హీరో కిరణ్ అబ్బవరం. ఎన్నో రోజులుగా ప్లాప్స్ ఎదుర్కొంటున్న ఈ నటుడు, ఈ ఇయర్ మొదట్లో వినరో భాగ్యము విష్ణు కథతో మరో యావరేజ్ హిట్ కొట్టాడు. కానీ ఆ వెంటనే మీటర్ తో డిజాస్టర్ అందుకుని తన ప్లాపుల పరంపరని కొనసాగిస్తున్నాడు. ఇక ఇప్పుడు రూల్స్ రంజన్ అంటూ మరో యాక్షన్ కామెడీ డ్రామా తో వస్తున్నాడు. అయితే ఆ సినిమాపై ముందు నుండి పెద్దగా అంచనాలు లేవు.

అయినా చిత్ర యూనిట్ ఎదో ఒక ఆశతో తమ చిత్రాన్ని ప్రమోట్ చేస్తూనే ఉంది. ఇక రూల్స్ రంజన్ సమ్మర్ లోనే రిలీజ్ కావాల్సి ఉండగా, పలు పెద్ద సినిమాల వల్ల వాయిదా పడుతూ వస్తుంది. మొన్నటివరకు ఆగష్టు18 న రిలీజ్ కావాల్సి ఉండగా, చిరంజీవి, రజినీకాంత్ సినిమాల వల్ల సెప్టెంబర్ 28కి వెళ్లారు. తాజాగా అక్కడి నుండి మళ్ళీ వాయిదా వేసి కొత్త రిలీజ్ డేట్ ని వెతుక్కున్నారు చిత్ర యూనిట్.

సెప్టెంబర్28న స్కంద రిలీజ్ అవుతుండడంతో మళ్ళీ సోలో గా రిలీజ్ చేయాలన్న ఉద్దేశంతో అక్టోబర్ 6న రూల్స్ రంజన్ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నామని ప్రకటించారు. మరి ఈ రిలీజ్ డేట్ ని అయినా ఫిక్స్ చేస్తారో లేక అప్పటికి ఏదైనా పోటీగా సినిమా వస్తే మళ్ళీ తమ సినిమాని వాయిదా వేసుకుంటారో తెలియదు గాని, సినిమాపై ప్రేక్షకుల్లో ఎటువంటి అంచనాలు కూడా లేవు. మరి అలాంటప్పుడు సినిమా ఎప్పుడు రిలీజ్ చేస్తే ఏంటని నెటిజన్లు అంటున్నారు.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు