Rules Ranjan: అందాల ఆరబోతతో కుర్రకారుని “సమ్మోహనుల్ని” చేసిన నేహా!

టాలీవుడ్ లో గ్లామర్ పాత్రలకు ప్రాధాన్యం ఇస్తూ వరుస సినిమాలతో దూసుకుపోతుంది నేహా శెట్టి. డీజే టిల్లు బ్లాక్ బస్టర్ తర్వాత చిన్న గ్యాప్ తీసుకున్న ఈ భామ, ఇప్పుడు వరుస సినిమాలతో బిజీ అవుతుంది. తెలుగులో రెండు చిత్రాల్లో నటిస్తుండగా, తమిళ్ లో మరో సినిమా చేస్తుంది. ఇక లేటెస్ట్ గా కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తున్న “రూల్స్ రంజన్” లో నేహా శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే.

తాజాగా ఈ సినిమా నుండి “సమ్మోహనుడా” పేరుతో ఒక రొమాంటిక్ సాంగ్ ని మేకర్స్ రిలీజ్ చేయడం జరిగింది. మెలోడీ క్వీన్ శ్రేయ ఘోషల్ పాడిన ఈ పాట మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. అమ్రిష్ అందించిన మ్యూజిక్ చాలా బాగుంది. మెలోడీ ట్యూన్స్ తోనే ఈ పాట సాగినా, నేహా శెట్టి మాత్రం ఈ పాటలో అందాలారబోసింది. రొమాంటిక్ గా సాగిన పాట మొత్తంలో ఈ టిల్లు భామే స్పెషల్ అట్రాక్షన్ గా నిలవగా, మంచి రెయిన్ సాంగ్స్ లో ఒకటిగా ఇది నిలవనుంది. పాట లిరిక్స్ కూడా వినసొంపుగా ఉన్నాయి.

- Advertisement -

ఇక ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే 90శాతం పూర్తయిపోగా త్వరలోనే మిగతా భాగాన్ని ఫినిష్ చేస్తామన్నారు డైరెక్టర్ రత్నం కృష్ణ. ఇటు నేహా శెట్టి ఈ సినిమా తరువాత బెదురు లంక చిత్రంలోనూ నటిస్తుంది. ఇక రూల్స్ రంజాన్ సినిమా సమ్మర్ లోనే రిలీజ్ కావాల్సి ఉండగా, పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తుంది. ఇక ఇప్పుడు ఆగష్టు మూడో వారంలో కూడా సెప్టెంబర్ మొదటివారంలో రిలీజ్ చేసే ఆలోచనలో ఉంది చిత్ర యూనిట్.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు