Mega Family: మెగా హీరో ఇమేజ్ వద్దనుకుంటున్న అల్లు అర్జున్..?

Mega Family:

అల్లు అర్జున్.. గంగోత్రి సినిమాతో తెలుగు తెరపై హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. అల్లు రామలింగయ్య కుటుంబం నుంచి, మెగా అండతో, ఆ తర్వాత తన సొంత టాలెంట్ తో స్టార్ హీరోగా ఎదిగి ఇప్పుడు ఇండియా మొత్తానికి ఐకాన్ స్టార్ గా మారాడు అల్లు అర్జున్. తన అద్భుతమైన డ్యాన్స్, నటనతో ఈరోజు కోట్లాదిమంది అభిమానుల్ని సంపాదించుకున్నాడు. అయితే మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ ల మధ్య దూరం పెరుగుతుందా..? అంటే అవుననే అంటున్నాయి సినీ వర్గాలు. ఈ రెండు కుటుంబాల మధ్య విభేదాలు ఉన్నాయని ఎప్పటినుంచో వినిపిస్తున్న మాటే.

అయితే మెగాస్టార్ చిరంజీవి అభిమానులలో ఓవర్గం అల్లు అర్జున్ పై గుర్రుగా ఉంటున్నారు. టాలీవుడ్ స్టార్ హీరోగా బన్నీ ఎదగడం వెనక మెగాస్టార్ ఉన్నా.. ఆ విషయాన్ని అతడు ఒప్పుకోవడం లేదని, తన సొంతగానే ఎదిగినట్లు బిల్డప్ ఇస్తున్నాడని మెగా ఫ్యాన్స్ లోని ఓవర్గం కంప్లైంట్ చేస్తూ ఉంది. అంతేకాదు ఈమధ్య సోషల్ మీడియాలో బన్నీని విపరీతంగా ట్రోల్ కూడా చేస్తున్నారు. తాజాగా అల్లు అర్జున్ కి ఉత్తమ జాతీయ నటుడు అవార్డు వచ్చింది. 69 ఏళ్ల జాతీయ అవార్డుల చరిత్రలో తెలుగు నటుడు ఉత్తమ జాతీయ అవార్డు కైవసం చేసుకోవడం ఇదే తొలిసారి.

అంతేకాక ఇటీవల అల్లు అర్జున్ తన దివంగత తాతయ్య అల్లు రామలింగయ్య ఫోటోని సోషల్ మీడియాలో మై ఫౌండేషన్ అనే ట్యాగ్ లైన్ తో అప్లోడ్ చేయడం మెగా అభిమానుల ఆగ్రహానికి ఓ కారణంగా నిలిచింది. దీన్ని తిరుగుబాటు ధోరణిగా భావిస్తూ మెగా ఫ్యాన్స్ అల్లు అర్జున్ పై విరుచుకుపడుతున్నారు. గతంలో ఈ కట్టె కాలే వరకు మెగా అభిమానినే అని చెప్పిన అల్లు అర్జున్.. ఇటీవలి కాలంలో అల్లు ఆర్మీకి తాను ఎప్పటికీ రుణపడి ఉంటానని విభజించి మాట్లాడడం కూడా ఈ వివాదానికి కారణమైందట. మొత్తానికి చిరు బ్రాండ్ తో కాకుండా అల్లు అర్జున్ సొంతంగా ఎదగాలనుకుంటున్నారు. కానీ ఇది మెగా అభిమానులకు రుచించడం లేదు.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the

Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు