Miss Shetty Mister Polishetty: నాలుగురోజుల్లో టార్గెట్ ఔట్.. ఇకపై బయ్యర్లకి పండగే!

Miss Shetty Mister Polishetty:

నవీన్ పొలిశెట్టి, అనుష్క శెట్టి జంటగా నటించిన తాజా చిత్రం ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి‘. సెప్టెంబర్ 7న రిలీజ్ అయిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద మంచి రెస్పాన్స్ ని దక్కించుకోగా, హీరో నవీన్ పొలిశెట్టి దగ్గరుండి ప్రమోషన్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. చాలా సార్లు వాయిదా పడి రిలీజ్ అయిన ఈ సినిమా ఎట్టకేలకి ఆడియన్స్ వద్దకి రావడం మాత్రమే కాదు, సూపర్ రెస్పాన్స్ తో బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన కలెక్షన్లను సాధిస్తూ దూసుకుపోతుంది.

ఇక ఈ సినిమా ఫస్ట్ డే జవాన్ ఎఫెక్ట్ వలన నార్మల్ ఓపెనింగ్స్ తెచ్చుకున్నప్పటికీ ఆ తర్వాత వీకెండ్ లో మాత్రం దుమ్ము లేపింది. ఇక నాలుగోరోజు హాలిడే అడ్వాంటేజ్ తో మమ్మోత్ కలెక్షన్లు సాధించింది ఈ సినిమా తెలుగు రాష్ట్రాలతో కలిపి వరల్డ్ వైడ్ గా 4.36కోట్ల షేర్ సాధించిన ఈ సినిమా నాలుగు రోజుల కలెక్షన్లతోనే నిర్మాతలకి ప్రాఫిట్స్ వచ్చేలా చేసింది. మంచి కామెడీ డ్రామాతో పాటు, మెసేజ్ ఉన్న మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టికి పలువురు సెలబ్రిటీల నుండి కూడా పాజిటివ్ ట్వీట్స్ రావడం ఈ సినిమాకి ప్లస్ అయిందని చెప్పొచ్చు.

అయితే మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి దాదాపు 13 కోట్ల బిజినెస్ చేయగా, 13.50 కోట్ల టార్గెట్ తో రిలీజ్ అయింది. ఇక నాలుగు రోజుల్లో ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 13.26కోట్ల షేర్, 25.65కోట్ల గ్రాస్ సాధించి సేఫ్ జోన్లోకి వచ్చింది. ఇక 5వ రోజు నుండి ఈ సినిమాకి ప్రాఫిట్స్ లోకి అడుగుపెడుతుంది. ఇక ఈ సినిమా తొలి వారం పూర్తయ్యే సరికి దాదాపు 20కోట్లకి అటు ఇటుగా వసూలు చేసే అవకాశం ఉంది.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు