Rolex: ‘లోకి’ తో తలైవర్171 మూవీ.. మరి వాటి సంగతేంటయ్యా?

Rolex:

తమిళ్ డైరెక్టర్ లోకేష్ కానగరాజ్ ఫుల్ స్వింగ్ మీదున్నాడు. మాములుగా స్టార్ డైరెక్టర్లు రెండేళ్లకో సినిమా తీస్తూ ఉంటారు. కానీ లోకేష్ మాత్రం అలా కాకుండా సినిమాల మీద సినిమాలు గ్యాప్ లేకుండా తీస్తూనే ఉన్నాడు. ఈ డైరెక్టర్ విక్రమ్ తర్వాత విజయ్ తలపతి తో “లియో” అనే సినిమా చేస్తున్నాడన్న సంగతి తెలిసిందే. ఆ సినిమా దసరా కానుకగా రిలీజ్ కి రెడీ అవుతుంది. ఈ లోపే మరో సినిమా అనౌన్స్ మెంట్ వచ్చి పడింది.

అదే సూపర్ స్టార్ రజినీకాంత్ తో సినిమా. ఈ కాంబో లో సినిమా ఉంటుందని ముందునుండి వార్తలు వస్తున్నా, రజినీకాంత్ కి ఉన్న కమిట్ మెంట్ల వల్ల ఉండదని చాలా మంది అన్నారు. కానీ అన్ ఎక్స్ పెక్టడ్ గా ఈ రోజు సినిమా అనౌన్స్ అయింది. తలైవర్171 పేరుతో జైలర్ తీసిన నిర్మాతే కళానిధి మారన్ నిర్మిస్తున్నట్టు పోస్టర్ ద్వారా తెలిపారు. ఇక్కడి వరకు బాగానే ఉన్నా లోకేష్ కానగరాజ్ ఫ్యాన్స్ మాత్రం మరో విషయంలో చాలా ఫ్రస్టేటెడ్ గా ఉన్నారు.

అదే.. లోకి యూనివర్స్ లో ఇప్పటివరకు వచ్చిన ఖైదీ, విక్రమ్ సినిమాలకి సంబందించి రెండో పార్ట్స్ రాలేవు. ఖైదీ2, విక్రమ్2 తో పాటు, రోలెక్స్ బ్యాక్ స్టోరీ కూడా ఉందని చెప్పారు. మరి వీటికి సంబంధించి అసలు అప్డేట్స్ కూడా ఇవ్వడం లేదని లోకి యూనివర్స్ ఫ్యాన్స్ సోషల్ మీడియా లో మీమ్స్ ద్వారా అడుగుతూనే ఉన్నారు. ఇప్పుడు వచ్చే లియో తర్వార్థ రజిని తో చేసే సినిమా 2025 లో వచ్చే అవకాశం ఉంది. మరి తన సినిమాల రెండో పార్ట్స్ ఎప్పుడు తీస్తారని ట్రేడ్ విశ్లేషకులు కూడా లెక్కలేస్తున్నారు. పైగా లోకేష్ పది సినిమాలు మాత్రమే తీస్తాడని అప్పట్లో చెప్పాడు. మరి దీనిపై లోకేష్ కానగరాజే క్లారిటి ఇస్తే బాగుంటుంది.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు