Leo: నాన్ స్టాప్ గా లియో షూటింగ్.. మరో రెండు నెలల్లో పూర్తి

కోలీవుడ్ స్టార్ విజయ్ దళపతి లేటెస్ట్ గా నటిస్తున్న సినిమా లియో. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ఈ సినిమా వస్తుంది. కోలీవుడ్ లోనే కాకుండా ఈ సినిమాకు అన్ని భాషల్లోనూ విపరీతమైన అంచనాలున్నాయి. ఎందుకంటే వీరి కాంబినేషన్ లో ఇంతకు ముందు వచ్చిన “మాస్టర్” ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే. 2021 పొంగల్ కి వచ్చిన ఆ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ తో 300 కోట్లకి పైగా వసూలు చేసింది.

తర్వాత లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో వచ్చిన విక్రమ్ సినిమా సంచలన విజయం సాధించి తమిళ ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసింది. ఇటు విజయ్ కూడా వారిసు తో మరోసారి బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు వీరి కాంబినేషన్ లో వస్తున్న లియో సినిమా పై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

సెవెన్ స్క్రీన్ స్టూడియో కంపెనీ పై S.S. లలిత్ కుమార్, జగదీశ్ ఫలనిసామీ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాకు అనిరుద్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తుండగా అర్జున్, సంజయ్ దత్, ప్రియా ఆనంద్, గౌతమ్ మీనన్, మనోబాల తదితరులు కీలక పాత్రలు చేస్తున్నారు.

- Advertisement -

ఈ సినిమా తర్వాత షెడ్యూల్ చెన్నై, హైదరాబాద్ లలో జరుగునుంది. ఇప్పటికే 50 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా, మరో రెండు నెలల్లో షూటింగ్ మొత్తం పూర్తి చెయ్యాలని లోకేష్ కనగరాజ్ గట్టిగా ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా దసరా కానుక గా అక్టోబర్ 19 న విడుదల చేస్తున్నామని మేకర్స్ ఇంతకు ముందే ప్రకటించారు.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు