Manchu Vishnu : “హౌస్ అఫ్ మంచుస్” పై మంచు లక్ష్మి సంచలన కామెంట్స్..!

 

ఇటీవల మంచు మనోజ్ పోస్ట్ చేసిన ఒక పర్సనల్ వీడియో ఎంత సంచలనం రేపిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మొదట్లో అందరూ ఇది ప్రాంక్ అనుకున్నప్పటికీ మంచు శిబిరం నుండి ఎలాంటి క్లారిటీ లేకపోవటంతో ఆ ఇష్యూ అక్కడితో చల్లారినట్టయింది.  అయితే ఇదంతా హౌస్ అఫ్ మంచుస్ అనే ఒక రియాలిటీ షో లో భాగం అంటూ మంచు విష్ణు ఒక ప్రోమో వదలటంతో మళ్ళీ ఈ ఇష్యూ తెరపైకి వచ్చింది. సదరు షో ప్రోమో గురించి మంచు లక్ష్మిని నెటిజెన్స్ ప్రశ్నించగా ఆ షో తో తనకు సంబంధం లేదని, తనకు ఆ షో గురించి అస్సలు తెలియదని బదులిచ్చారట.

అంతే కాకుండా ఈ విషయంపై మంచు మనోజ్ టీం నుండి ఇదే రకమైన స్పందన వచ్చినట్టు సమాచారం. దీంతో హౌస్ అఫ్ మంచుస్ అన్నది ఒక ఫేక్ షో అన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఆ ప్రోమో వీడియో కూడా మంచు విష్ణు చేపట్టిన డ్యామేజ్ కంట్రోల్ చర్యలో భాగమే అని పలువురు అభిప్రాయ పడుతున్నారు. ఆ వీడియో కూడా ప్రాంక్ కాదని, మోహన్ బాబు మనిషి అయిన సారధి ఇంటికి వెళ్లి విష్ణు గొడవ పడుతూ ఉండగా మనోజ్ టీం కాల్ చేస్తేనే మనోజ్ అక్కడికి వెళ్లారని టీం చెప్తున్న కధనం ప్రకారం తెలుస్తోంది.

- Advertisement -

మంచు కుటుంబం సోషల్ మీడియాలో ట్రోల్ అవ్వటం ఇదేమి కొత్త కాదు, గతంలో చాలా సార్లు ట్రోల్ అయినప్పటికీ తమ కుటుంబ అంతర్గత విషయాలు బయటికి వచ్చి ట్రోల్ అవ్వటం ఇదే మొదటిసారి. అయితే, మంచు విష్ణు అనౌన్స్ చేసిన హౌస్ అఫ్ మంచుస్ రియాలిటీ షో ఉంటుందా ఉండదా? ఉంటే ఆ షో గురించి నెక్స్ట్ అనౌన్స్ మెంట్ ఎప్పుడొస్తుంది?, ఒకవేళ అది ఫేక్ అయితే విష్ణు నుండి ఎలాంటి ఎక్సప్లనేషన్ ఉండబోతుంది అన్న అంశాల పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

 

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు