Insta Record: ఇంస్టాగ్రామ్ ను వదల్లేదు విజయ్ ఫ్యాన్స్

కోలీవుడ్ స్టార్ విజయ్ దళపతి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తమిళ్ లో రజినీకాంత్ తర్వాత ఆ రేంజ్ ఫ్యాన్ బేస్ ని కలిగిఉన్నాడు. ఇక తన ఫ్యాన్స్ గురించి కూడా తెలియందేమి కాదు. వీళ్ళు సోషల్ మీడియా లో సృష్టించే రికార్డులు అంతా ఇంత కాదు. సోషల్ మీడియా లో ఏ హీరో రికార్డు అయినా సరే విజయ్ రికార్డు తర్వాతనే ఉండాలని కోరుకుంటారు. అది ఏ రికార్డయినా క్రియేట్ చేస్తారు. లేదా బ్రేక్ చేస్తారు. యూట్యూబ్ ట్రైలర్ రికార్డు, లేదా సాంగ్ వ్యూస్ రికార్డు, ఇంకా ఫేస్బుక్ లైక్స్ రికార్డులు ఇలా దేన్నీ వదలరు.

ఇక తాజాగా విజయ్ పేరిట మరో రికార్డు నమోదైంది. చాలా రోజుల నుంచి విజయ్ ఇంస్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేస్తున్నారని రూమర్స్ వస్తున్నాయి. అయితే నిన్న ఏప్రిల్ 2 న విజయ్ అఫిషియల్ గా తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ ని ఓపెన్ చేయడం జరిగింది. అయితే అకౌంట్ ఓపెంట్ చేసిన గంట వ్యవధి లోనే 1 మిలియన్ ఫాలోవర్స్ ని సాధించి విజయ్ పేరిట భారీ ఇంస్టాగ్రామ్ రికార్డు క్రియేట్ అయింది. అంతే కాదు ఆయన పెట్టిన మొదటి స్టిల్ కి గంటల వ్యవధి లోనే 1 మిలియన్ లైక్స్ వచ్చాయి.

ప్రస్తుతం ఇంస్టాగ్రామ్ లో 4 మిలియన్ల ఫాలోవర్స్ ని కంప్లీట్ చేసుకోబోతుంది.  ఇప్పుడు విజయ్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వం లో లియో అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా అక్టోబర్ 19 న విడుదలకు సిద్ధం అవుతుంది. మరి రానున్న రోజుల్లో విజయ్ పేరిట ఇంస్టాగ్రామ్ లో మరెన్ని రికార్డులు నమోదు అవుతాయో చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు