Naveen Polishetty: ఫ్రెష్ కామెడీ తో వస్తున్న మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి

అనుష్క శెట్టి చాలా రోజుల తర్వాత నటిస్తున్న చిత్రం “మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి”. ఈ సినిమాలో నవీన్ పొలిశెట్టి హీరోగా నటిస్తున్నాడు. 2020 లో వచ్చిన నిశ్శబ్దం తర్వాత మరో సినిమా చేయలేదు అనుష్క. ఇప్పుడు మూడేళ్ళ గ్యాప్ తర్వాత ఈ సినిమా తో పలకరించబోతుంది అనుష్క శెట్టి. ఇటు నవీన్ పొలిశెట్టి కూడా జాతి రత్నాలు సినిమా తర్వాత మరో సినిమా చేయలేదు. అయితే అనుష్క శెట్టి నవీన్ పొలిశెట్టి కలిసి సినిమా చేస్తారని ఎవ్వరూ ఊహించలేదు. కానీ ఈ కాంబినేషన్ సెట్ అయింది. వెరైటీ గా అదే ఈ సినిమాకు ప్లస్ కూడా అయింది. అంతే కాదు అనుష్క తన కంటే ఎనిమిదేళ్లు చిన్నవాడైన హీరోతో నటిస్తుండటం విశేషం.

తాజాగా ఏప్రిల్ 29 న మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి మూవీ కి సంబంధించిన టీజర్ విడుదలయింది. అయితే 6 గంటలకి విడుదల అవ్వాల్సిన ఈ టీజర్ డిలే అయ్యి రాత్రి తొమ్మిది గంటలకు రిలీజ్ అయ్యింది. అయినా కూడా టీజర్ కేవలం 9 గంటల్లోనే 1 మిలియన్ వ్యూస్ అందుకోవడం విశేషం. ఈ సినిమాలో ఒక ప్రొఫెషనల్ చెఫ్ గా కనిపిస్తుంది అనుష్క శెట్టి. ఇక నవీన్ పొలిశెట్టి స్టాండప్ కమెడియన్ గా ఈ సినిమాలో నటించాడు. టీజర్ మొత్తం నవీన్ పొలిశెట్టి ఫ్రెష్ కామెడీ తో నవ్వులు పోయించాడు. అనుష్క పాత్ర డీసెంట్ గా ఉంది. సినిమా లో సెట్టింగ్ లు, లొకేషన్ల జోలికి పోకుండా సింపుల్ గా తీసినట్లు ఉంది. ఈ జనరేషన్ లో ఇలాంటి సినిమాలకి మంచి డిమాండ్ ఉంది. ఓవరాల్ గా టీజర్ తో మాత్రం ఒక్కసారిగా మంచి హైప్ వచ్చిందనే చెప్పాలి.

- Advertisement -

మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాను P. మహేష్ బాబు అనే కొత్త దర్శకుడు తెరకెక్కించగా యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో వంశీ ప్రమోద్ కలిసి నిర్మించారు. రాధన్ ఈ సినిమాకు మ్యూజిక్ అందించగా సమ్మర్ లో మూవీ విడుదలకు సిద్ధం అవుతుంది.

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు