Prema Vimanam: మహేష్ బాబు లాంచ్ చేసిన కొత్త వెబ్ సినిమా టీజర్

అభిషేక్ నామా నిర్మాత గా అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ పై సంతోష్ కాలా అనే కొత్త దర్శకుడు తెరకెక్కించిన చిత్రం ప్రేమ విమానం. సంగీత్ శోభన్, శాన్వి మేఘన ఈ సినిమాలో జంటగా నటించారు. ఏప్రిల్ 27 న సూపర్ స్టార్ మహేష్ బాబు చేతుల మీదుగా ఈ సినిమా యొక్క టీజర్ ని లాంచ్ చేసారు. టీజర్ మొత్తం వినోద భరితంగా ఉంది. టీజర్ లో గమనించగా ఈ టీజర్ లో ఇద్దరు పిల్లలు ఒక విమానం చూసి ఏరోజైనా ఒక్కసారైనా విమానం ఎక్కాలని కలగంటూ ఉంటారు. దాని కోసం ఊరిలో ఉండే వెన్నెల కిషోర్ ని అడిగి అడిగి విసిగిస్తారు. ఈ టీజర్ లో అదే ప్రధానంగా సాగింది.

క్రమంగా కథ హీరో, హీరొయిన్ల వైపుకు కథ తిరుగుతుంది. వారి వల్ల ఊళ్ళో జరిగే కొన్ని సమస్యలను ఇందులో చూపించడం జరిగింది. టీజర్ నిర్మాణ విలువలు బాగున్నాయి. ప్రేమ విమానం టీజర్ లో వెన్నెల కిషోర్, అనసూయ భరధ్వాజ్, రవివర్మ, గోపరాజు రమణ కీలక పాత్రల్లో నటించారు.

- Advertisement -

ఇక ఈ సినిమా కు అనూప్ రూబెన్స్ సంగీతం అందించాడు. జగదీష్ చీకటి అందించిన సినిమాటోగ్రఫీ బాగుంది. అయితే ప్రేమ విమానం సినిమా థియేటర్లలో కాకుండా ఓటీటీ ప్లాట్ఫామ్ అయిన జీఫైవ్ లో విడుదల చేస్తున్నారు. తెలుగు మరియు తమిళ భాషల్లో ఒకేసారి ఈ సినిమాను సమ్మర్ లో విడుదల చేయనున్నారు.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు