Sai dharam tej: విరూపాక్ష కి అంత సీన్ ఉందా ?

సాయి ధరమ్ తేజ్ హీరోగా వచ్చిన విరూపాక్ష సినిమా బ్లాక్ బస్టర్ దిశగా పరుగులు తీస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే  70 కోట్ల పైగా వసూళ్ళని రాబట్టిన ఈ సినిమా రిలీజై పదిరోజులు అవుతున్న కూడా ఇంకా మంచి కలెక్షన్స్ ని సాధిస్తూ థియేటర్స్ లో సందడి చేస్తుంది. విరూపాక్ష సినిమా సాయి ధరమ్ తేజ్ కెరీర్ లోనే హైయెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టి తేజ్ కెరీర్ లోనే గుర్తుండిపోయే చిత్రంగా నిలిచింది.

అయితే మొదటగా విరూపాక్ష సినిమాని అన్ని భాషల్లో ఒకేరోజున రిలీజ్ చేస్తాం అని ప్రకటించిన మూవీ టీం తరువాత పలు కారణాల వల్ల అదే రోజున రిలీజ్ చేయలేకపోయారు. ఇప్పుడు విరూపాక్ష సూపర్ సక్సెస్ అవడంతో మూవీ యూనిట్ సినిమాని పాన్ ఇండియా రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు. తమిళ్ లో స్టూడియో గ్రీన్ సంస్థ ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నారు. మలయాళంలో ఈ4 ఎంటర్టైన్మెంట్స్, హిందీలో గోల్డ్ మైన్స్ ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నారు.

అయితే విరూపాక్ష సినిమా మంచి థ్రిల్లర్ సినిమానే అయినప్పటికీ పాన్ ఇండియా రిలీజ్ చేసేంత గొప్ప సినిమా ఐతే కాదు అని ఫిలిం క్రిటిక్స్ అభిప్రాయ పడుతున్నరంట. మలయాళంలో విరూపాక్ష ని మించి థ్రిల్లర్ సినిమాలు చాలానే వచ్చాయి. ఇక తమిళ్ లో చూస్తే వాళ్ళు చేసే థ్రిల్లర్ సబ్జక్ట్స్ తో పోలిస్తే, విరూపాక్ష వాటిని మ్యాచ్ చేయడం కష్టమే పైగా మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన పొన్నియన్ సెల్వన్ 2 తమిళనాడులో బ్లాక్ బస్టర్ టాక్ తో నడుస్తుంది. మరి ఇలాంటి సమయంలో అక్కడ విరూపాక్షిని చూస్తారా, చూడరా అనేది ప్రశ్నర్థకం.

- Advertisement -

ఇక సినిమాలో మేజర్ మైనస్ అంటే సాయి ధరమ్ తేజే.. పర్ఫామెన్స్ వైస్ పర్లేదు అనిపించినా సినిమాలో మాత్రం హీరోగా తేజ్ చేసేది ఏమి ఉండదు. కథ పరంగా స్ట్రాంగ్ గానే ఉన్న హీరో క్యారెక్టర్ మాత్రం చాలా బలహీనంగా ఉంటుంది. ఒక్క క్లైమాక్స్ లో హీరో చేసే హడావిడి తప్ప సినిమాలో మొదటినుంచి హీరో చేసే ఏ పని గొప్పగా అనిపించదు. సాయి ధరమ్ తేజ్ మీద సానుభూతితో తెలుగు ప్రేక్షకులు సినిమా చూసిన మిగితా భాషల్లో ప్రేక్షకులు అలా ఉండరు కదా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి ఈ అభిప్రాయాలు నిజం అవుతాయో లేదా సినిమా వాళ్ళకి నచ్చి హిట్ అవుతుందో లేదో తెలియాలంటే రిలీజ్ వరకు వెయిట్ చేయాలి.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు