Tollywood: మహాకవి శ్రీశ్రీ జయంతి స్పెషల్

శ్రీ రంగం శ్రీనివాసరావు. నేటి తరానికి ఈయన గురించి అంతగా తెలియకపోవచ్చు. కానీ తెలుగు వారు గుర్తించాల్సిన మహా కవి ఆయన. విప్లవ కవి గా, గేయ రచయిత గా, ఒక హేతువాదిగా 60 నుంచి 80 వ దశకం లో ప్రసిద్ధికెక్కారు. ఈరోజు అనగా ఏప్రిల్ 30 న మహాకవి శ్రీ శ్రీ జయంతి. ఈ సందర్బంగా ఆయన గురించి కొన్ని విశేషాలను తెలుసుకుందాం.

1910 ఏప్రిల్ 30 న విశాఖ పట్నం లో జన్మించిన ఆయన చిన్ననాటి నుండే కవితలు, కథలు రాయడం నేర్చుకున్నాడు. 1931 లో మద్రాస్ విశ్వా విద్యాలయం లో బి.ఏ పూర్తి చేసిన ఆయన ఢిల్లీ లో ఆకాశవాణి లో ఎడిటర్ గా కొన్నాళ్ళు పనిచేశారు. ఆ తర్వాత నిజాం నవాబ్ దగ్గర, ఇంకా ఆంధ్రవాణి పత్రిక లో కొన్నాళ్ళు పనిచేశారు. 1933 నుండి 40 వరకు ఆయన రాసిన మహా ప్రస్థానం పుస్తకం ద్వారా ప్రజలందరికి ఆయన చేరువయ్యారు. తెలుగు సాహిత్య దశను కొత్త దశలోకి తీసుకెళ్లిన ఘనత ఆ పుస్తకానిది.1947 లో మద్రాస్ కి వచ్చి అక్కడే స్థిర పడ్డారు. శ్రీశ్రీ గ్రాంధిక శైలి, ఛందస్సు వంటి వాటిని పక్కన పెట్టి వాడుక భాషలో ప్రజలకర్థమయ్యే విధంగా రచనలు చేసేవారు.

శ్రీశ్రీ ఆధునిక కవి కావడంతో ప్రత్యక్షంగా సినిమాలతో సంబంధం లేకపోయినా పరోక్షంగా సంబంధం వుండేది. 1950 నుండి ప్రత్యక్షంగా సినిమాల్లో గేయ రచనలు చేయడం ఆరంభించారు. తెలుగు సినిమా తొలి తరం దర్శకుడైన హెచ్.ఎం రెడ్డి శ్రీ శ్రీ రచనలకు ముగ్దుడై ఆయనను ఆస్థాన రచయిత గా పెట్టుకున్నారు. ఇక ఆ తర్వాత 1956 లో వచ్చిన ఇలవేల్పు చిత్రంలో “చల్లని రాజా ఓ చందమామ” పాటతో సినీ వర్గం దృష్టిని ఆకర్షించాడు. ఆ తర్వాత వెలుగు నీడలు, బొబ్బిలి సింహం, జయ భేరి, వంటి విజయవంతమైన చిత్రాలకు పాటలు రాసారు. స్వతహాగా గా విప్లవ రచయిత అయిన శ్రీశ్రీ సినిమాల్లో కూడా అలాంటి పాటల ద్వారానే ఎక్కువ ప్రఖ్యాతి పొందారు.

- Advertisement -

1974 లో కృష్ణ హీరోగా నటించిన “అల్లూరి సీతారామరాజు” చిత్రం ద్వారా ఆయన కలం దేశవ్యాప్తంగా విస్తరించింది. ఈ చిత్రంలో ఆయన రాసిన “తెలుగు వీర లేవరా” అనే స్వాతంత్ర గీతం వింటే ఇప్పటికి తెలుగోడి రోమాలు నిక్కబొడుచుకుంటాయి. ఈ పాటకు గాను శ్రీశ్రీ కి ఉత్తమ గేయ రచయిత గా నేషనల్ అవార్డు వచ్చింది. ఆ తర్వాత 1983 లో వచ్చిన నేటి భారతం సినిమాలో అర్ధరాత్రి స్వతంత్రం పాటకి మరోసారి నేషనల్ అవార్డు వచ్చింది. ఆ తర్వాత శ్రీశ్రీ 1983 జూన్ 15న మరణించారు.

అయితే ఆయన రాసిన పుస్తకాల్లోని వాక్యాలు, కవితలు కూడా ఆ తర్వాత సినిమాల్లో ఉపయోగించడం జరిగింది. 1989 లో చిరంజీవి హీరోగా వచ్చిన రుద్రవీణ చిత్రంలో చెప్పాలని ఉంది పాట అలాంటిదే. ఈ పాట సిరివెన్నెల సీతారామశాస్త్రి రాసిన కూడా, పాట మూడవ చరణం లో “నేను సైతం ప్రపంచాగ్నికి ” అనే కవిత శ్రీశ్రీ రాసినదే. ఆ తర్వాత ఈ పాటనే చిన్నపాటి మార్పులు చేసి 2003 లో ఠాగూర్ చిత్రం లో రచయిత సుద్దాల అశోక్ తేజ రాసారు. ఈ పాటకి ఆ సంవత్సరం ఉత్తమ గేయ రచయిత గా సుద్దాల అశోక్ నేషనల్ అవార్డు ని అందుకున్నారు.
ఈ విధంగా శ్రీశ్రీ సినీ రంగం ద్వారా కూడా ఆయన తన ఉనికిని చాటుకున్నారు. సినీ ఇండస్ట్రీ లో ఉద్దండులైన రచయితలు సిరివెన్నెల సీతారామశాస్త్రి, సుద్దాల అశోక్ తేజ, చంద్ర బోస్ వంటి రచయితలు ఆయన్ని ఆదర్శంగా తీసుకొని పైకొచ్చిన వారే.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు