Yadha Praja Thadha Raja : బ్రో.. లక్ష్మణ్ కూడా హీరో అయిపోయాడు గా !

ఒక్కప్పుడంటే హీరో అవ్వాలంటే బాగా ఆస్థి ఉండాలి. పొలిటికల్ గా ఫ్యామిలీ పరంగా మంచి సపోర్ట్ ఉండాలి. కానీ ఇప్పుడు అలా కాదు టాలెంట్ ఉంటె చాలు. కొంతమంది టాలెంట్ లేకున్న కూడా హీరోలు అయిన వాళ్ళు కూడా ఉన్నారనుకోండి అది వేరే విషయం. ఐతే సినిమా తీయాలంటే మాత్రం ఒక కెమెరా, ఒక కథ, సపోర్ట్ గా కొంత మంది ఫ్రెండ్స్ ఉంటే చాలు. అంతే నెల తిరిగే లోపల హీరోగా గోడల మీద పోస్టర్ పడిపోద్ది. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే టాలీవుడ్ కి ఒక కొత్త హీరో వచ్చాడు అతనెవరో కాదు టేకుమూడి లక్ష్మణ్.

కొత్తగా రిలీజ్ అయిన సినిమాలకి థియేటర్స్ ముందు రివ్యూలు చెప్పే ఈ లక్ష్మణ్ ఈ మధ్య కాలంలో బాగా ఫెమస్ అయ్యాడు. బ్రో.. అంటూ అరుస్తూ చెప్పే ఈ లక్ష్మణ్ రివ్యూలు చూసిన జనాలు బాగా ఎంటర్టైన్ గా ఫీల్ అయ్యేవాళ్ళు. అయితే ఈ బ్రో.. లక్ష్మణ్ రివ్యూలు ఇచ్చిన ఫెమ్ తో ఈ మధ్యనే యూట్యూబ్ లో ఛానల్ ఓపెన్ చేసి గత కొద్దీ రోజులుగా షార్ట్ ఫిలిమ్స్ చేస్తూన్నాడు. సినిమాల్లో కూడా ఒకటి రెండు అవకాశాలు రావడంతో థియేటర్ బయట రివ్యూ చెప్పే స్థాయి నుంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎదిగాడు. అయితే ఇప్పుడు ఏకంగా హీరోగానే లాంచ్ అయ్యాడు.

కొత్త దర్శకుడు అజయ్ యార్లగడ్డ దర్శకత్వంలో ” యథా ప్రజా తథా రాజా” అనే సినిమాతో బ్రో… లక్ష్మణ్ హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. పొలిటికల్ ఎంటర్టైనర్ తెరకెక్కుతున్న ఈ సినిమాని షరీఫ్ ముజావర్ నిర్మించారు. ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ ని శనివారం రిలీజ్ చేసారు. అయితే ఈ ట్రైలర్ చుసిన కొంతమంది వీడు కూడా హీరో అయిపోయాడు అని, కొంతమంది అల్ ది బెస్ట్ లక్ష్మణ్ అంటూ విష్ చేస్తున్నారు. మరి ఈ సినిమా తరువాత లక్ష్మణ్ కెరీర్ ఎలా ఉండబోతుందో చూడాలి. ప్రసాద్ ఐమాక్స్ థియేటర్ ముందు సినిమా రివ్యూ చెప్పే దగ్గర నుండి ఇప్పుడు ఏకంగా సినిమాలో హీరోగానే చేస్తున్నాడు అంటే గొప్ప విషయం అనే చెప్పాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు