Jawan: రోజుకి వంద కోట్లు.. దంచి కొట్టడమంటే ఇదేనేమో..!

Jawan:

బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ చాలా ఏళ్ళ తర్వాత తన ప్రతాపం చూపిస్తున్నాడు. దాదాపు పదేళ్లుగా బాలీవుడ్ లో సత్తా చాటలేకపోయినా ఈ సూపర్ స్టార్ ఎప్పటికైనా బాక్స్ ఆఫీస్ బాద్ షా తనేనని ప్రూవ్ చేస్తున్నాడు. ఆల్రెడీ పఠాన్ తో దిమ్మ తిరిగే లెక్కలు సెట్ చేసిన షారుఖ్, ఇప్పుడు జవాన్ తో ఏకంగా దిమ్మ తిరిగి బొమ్మ చూపిస్తున్నాడు. అసలు మ్యాటర్ లోకి వస్తే, తమిళ్ స్టార్ డైరెక్టర్ అట్లీ తో షారుఖ్ ఖాన్ జవాన్ సినిమా చేయగా, ఆ సినిమా సెప్టెంబర్ 7న రిలీజ్ అయి పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

అయితే ఈ సినిమా రిలీజ్ అయిన రోజు నుండే రికార్డులు బ్రేక్ చేయడం స్టార్ట్ చేసింది. ఫస్ట్ డే నే వంద కోట్ల కి పైగా ఓపెనింగ్స్ తో హిందీలో ఆల్ టైం రికార్డు ఓపెనింగ్ సెట్ చేస్తేనే షాక్ అయ్యారు బాలీవుడ్ ట్రేడ్ వర్గాలు. ఇప్పుడు ఈ సినిమా ఎవ్వరు ఊహించలేనంతగా రోజుకి వంద కోట్లకి పైగా కలెక్షన్లు సాధించి రికార్డు క్రియేట్ చేసింది. నాలుగు రోజుల వీకెండ్ అడ్వాంటేజ్ తో రిలీజ్ అయిన ఈ సినిమా, ఆ నాలుగురోజుల్లో వరల్డ్ వైడ్ గా 520కోట్ల కి పైగా గ్రాస్ వసూలు చేసి సంచలనం సృష్టించింది.

RRR తర్వాత నాలుగు రోజుల్లోనే 500 కోట్ల మార్క్ అందుకున్న రెండో సినిమా జవాన్ కావడం విశేషం. ఈ కల్లెక్షన్ల లెక్క చూసి ట్రేడ్ వర్గాలు దంచి కొట్టడం అంటే ఇదేనెమో అని మీమ్స్ వేస్తున్నారు. ఇక ఈ సినిమా వరల్డ్ వైడ్ గా తొలి వారం ముగిసే సరికి 700 కోట్ల మార్క్ కి చేరుకోవడం ఖాయం అని నెటిజన్లు అంటున్నారు. ఇక రెండో వారం లో కూడా పెద్దగా పోటీకి వచ్చే సినిమాలేమి లేకపోవడంతో జవాన్ మరో వీక్ దుమ్ములేపడం ఖాయం.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు