Nikhil: ‘స్వయంభు’ లో సంయుక్త అలాంటి రోల్ లో నటిస్తుందా?

Nikhil:

టాలీవుడ్ లో రూపొందుతున్న పాన్ ఇండియా సినిమాల్లో ‘స్వయంభు’ ఒకటి. నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా హిస్టారికల్ నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమా అని సమాచారం. భరత్ కృష్ణమచారి అనే కొత్త డైరెక్టర్ ఈ సినిమా చేస్తుండగా, పిక్సెల్ స్టూడియోస్ బ్యానర్ లో భువన్, శ్రీకర్ నిర్మిస్తున్నారు. ఠాగూర్ మధు సమర్పణలో రాబోతున్న ఈ భారీ బడ్జెట్ సినిమాకి మనోజ్ పరమహంస డివోపిగా వ్యవహరిస్తుండగా, కేజీఎఫ్ ఫేం రవి బసుర్ మ్యూజిక్ అందిస్తున్నారు. బింబిసార ఫేం వాసుదేవ్ మున్నెప్పగిరి ఈ సినిమాకు డైలాగ్స్ అందించనున్నారు.

ఇక ఈ సినిమాలో గోల్డెన్ లెగ్ సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా సంయుక్త మీనన్ పుట్టిన రోజు సందర్భంగా తనకి విష్ చేస్తూ చిత్ర యూనిట్ ఒక ఫస్ట్ లుక్ రిలీజ్ చేసింది. అయితే ఫస్ట్ లుక్ అంటే మామూలుగా ఆ నటీనటులకు చెందిన స్టిల్స్ మాత్రమే ఉంటాయి. కానీ వీళ్ళు రిలీజ్ చేసిన పోస్టర్ లో సంయుక్త మీనన్ కి బదులు ఒక శిల్పం లుక్ రిలీజ్ చేసారు. ఇక ఆ లుక్ సంయుక్త మీనన్ దేనని తెలుస్తూనే ఉంది.

అయితే రిలీజ్ చేసిన ఆ పోస్టర్ ని బట్టి సంయుక్త మీనన్ స్వయంభు లో ఒక రాజకుమారి పాత్ర లో నటిస్తుందంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. లేకపోతే ఒక దేవకన్య రోల్ కూడా అయి ఉండవచ్చు అని అనిపిస్తుంది. ఈ విషయంపై చిత్ర యూనిట్ క్లారిటీ ఇవ్వలేదు. అయితే సినిమా మాత్రం ఓ రేంజ్ లో ఉండబోతుందని వస్తున్న అప్డేట్స్ ని బట్టి తెలుస్తుంది. ఇక ఈ సినిమాతో సంయుక్త స్టార్ హీరోయిన్ అయ్యే ఛాన్స్ లు పుష్కలంగా ఉన్నాయి.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries.

Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు