BigBoss Season7: బిగ్ బాస్ 7 బెస్ట్ ఎపిసోడ్ అమర్ దీప్ ఫైర్..!

BigBoss Season7:

టెలివిజన్ లో బిగ్ బాస్ 7 సందడి మొదలై వారం అయినా ఇంకా, పస రాలేదని బిగ్ బాస్ ఫ్యాన్స్ అనుకుంటూ ఉన్నారు. ఫస్ట్ ఎపిసోడ్ మొదలుకొని ఇప్పటి వరకు చప్పగా సాగిన బిగ్ బాస్ షో ఇప్పుడిప్పుడే ఆసక్తిని రేపుతోంది. ఎక్కువగా సెలెబ్రిటీస్ కాకుండా, కొత్త వారు ఆడియన్స్ కి టచ్ లేని వారే రావడంతో పెద్దగా ప్రభావం చూపదని అందరు అనుకున్నారు.

కానీ ఒక్క ఎపిసోడ్ తో సీజన్లో ఫైర్ మొదలైనది. ఆ ఎపిసోడ్ లో బిగ్ బాస్ కంటెస్టెంట్లలో ఒకడిగా వచ్చిన పల్లవి ప్రశాంత్ హౌస్ మేట్స్ అందరి ఆగ్రహానికి బలవ్వాల్సి వచ్చింది. ముందు నుండి రైతు బిడ్డ అని చెప్పుకుని తిరిగే పల్లవి ప్రశాంత్ ఆ ట్యాగ్ తోనే బిగ్ బాస్ ఎంట్రీ ఇచ్చాడు. అయితే బిగ్ బాస్ లోకి వెళ్ళాక పల్లవి ప్రశాంత్ అందరితోనూ కలవకుండా, ఎదో ఆర్టిఫీషియల్ గా తానొక్కడే కష్టపడి పైకొచ్చానన్న లెవెల్లో హౌస్ మేట్స్ తో బెహేవ్ చేసాడు. దానికి బిగ్ బాస్ హౌస్ మేట్స్ అందరు ఒక్కసారిగా ఫైర్ అయ్యారు.

అయితే మొదట నెమ్మదిగానే పల్లవి ప్రశాంత్ ప్రవర్తన మార్చుకోవాలని హౌస్ మేట్స్ విజ్ఞప్తి చేస్తున్నా, ప్రశాంత్ మాటకి మాట అనడంతో హౌస్ కంటెస్టెంట్ లో ఒకడైన అమర్ దీప్ ఒక్కసారిగా ఫైర్ అయ్యాడు. అందరు కష్టపడి పైకి వచ్చిన వారే. రైతు బిడ్డ అనే ఒక్క సెంటిమెంట్ ని అడ్డం పెట్టుకుని రుద్దడం బాగాలేదని, సింపతీ ని అడ్డం పెట్టుకుని గెలవాలని చూడకూడదని అమర్ దీప్ అన్నాడు. సీజన్ మొదలైనప్పటినుండి అమర్ దీప్ క్యాజువల్ గా సైలెంట్ గా ఉన్నాడు.

- Advertisement -

కానీ ఈ ఎపిసోడ్ లో ఒక్కసారిగా ఫైర్ అయ్యే సరికి అమర్ దీప్ స్వింగ్ లోకి వచ్చాడు. ఈ ఎపిసోడ్ ద్వారా చాలా మంది నెటిజన్లు పల్లవి ప్రశాంత్ పై తమ అభిప్రాయాన్ని చాలా క్లియర్ గా అమర్ దీప్ బయట పెట్టాడని అంటున్నారు. ఏది ఏమైనా హౌస్ మేట్స్ చెప్పాక అయినా ప్రశాంత్ మారుతాడో లేదో మరి.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the

Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు