Akkineni family: తాగుబోతుగా మారిన అక్కినేని హీరో… అమలతో గొడవలు ?

Akkineni family:

టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. తెలుగు చిత్ర పరిశ్రమలో అక్కినేని నాగేశ్వరరావు ఎన్నో బ్లాక్ బాస్టర్ సినిమాలు చేసి స్టార్ హీరోగా ఎదిగారు. ఇక అక్కినేని నాగేశ్వరరావు వారసుడిగా నాగార్జున ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఇప్పటికి ఎన్నో సంవత్సరాలు అవుతుంది. ఎన్నో బ్లాక్బస్టర్ సినిమాలలో కూడా నటించి స్టార్ హీరోగా పేరుపొందాడు నాగార్జున. నాగార్జున కుమారులు కూడా ఇప్పుడు ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు.

ఇది ఇలా ఉండగా తాజాగా అక్కినేని నాగార్జున గురించి సంచలన విషయాలు వెల్లడించింది ఆయన భార్య అమల. అక్కినేని నాగార్జున మరియు నాని కాంబినేషన్లో దేవదాసు సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో నాగార్జున ఎక్కువగా తాగుతూ కనిపిస్తాడు. అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో ప్రతిరోజు ఇంట్లో తాగి షూటింగ్ కు వెళ్లేవాడట నాగార్జున.

ఈ సినిమా షూటింగ్ అయిపోయిన తర్వాత కూడా అదే పనిగా నాగర్జున తాగేవాడట. దీంతో ఆగ్రహానికి లోనైన అమల… నాగార్జునతో వాగ్వాదానికి దిగిందట. అయినప్పటికీ నాగార్జున తాగడం మానేయ లేదట. దీంతో నాగార్జునతో మాట్లాడడం కూడా మానేసిందట అమల. ఇక చేసేదేమీ లేక… నాగార్జున మద్యం తాగడం మానేశాడట. ఈ విషయాలను తాజాగా అమల వెల్లడించింది.

- Advertisement -

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు