Nikhil latest movie: ఆసక్తి రేకెత్తిస్తున్న స్వయంభూ

Nikhil latest movie

యంగ్ హీరో నిఖిల్ మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ తో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అయ్యాడు. ఇటీవల కాలంలో వరుస థ్రిల్లర్ సినిమాలు చేస్తూ ప్రస్తుతం ఉన్న హీరోలలో ప్రామిసింగ్ హీరోగా పేరు తెచ్చుకున్న నిఖిల్ ఈసారి భారీ స్థాయి పాన్ ఇండియా సినిమాతో ప్రేక్షకుల ముందుకి వస్తున్నాడు.

ఇప్పటికే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సమర్పణలో ది ఇండియా హౌస్ పేరిట.. ఒక భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ సినిమాలో నటిస్తున్న నిఖిల్. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఇంకా మొదలవకుండానే అంతలోనే స్వయంభూ అనే మరో సినిమా స్టార్ట్ చేసాడు. భరత్ కృష్ణమాచారి అనే కొత్త దర్శకుడిని పరిచయం చేస్తూ రాబోతున్న ఈ సినిమా షూటింగ్ ఈరోజు నుంచే మొదలు పెడుతున్నట్టు మూవీ టీం పోస్టర్ ద్వారా తెలిపింది.

ఇక పోస్టర్ విషయానికొస్తే నిఖిల్ వారియర్ గెటప్ లో కనిపిస్తున్నాడు. టైటిల్ మరియు పోస్టర్ ను బట్టి చూస్తే నిఖిల్ నటించిన కార్తికేయ ఫిలిం సిరీస్ లాగానే స్వయంభూ సినిమా కూడా దేవాలయం చుట్టూ జరిగే కథలాగా అనిపిస్తోంది. ఇక పోస్టర్ ఉన్న మరో ఇంట్రెస్టింగ్ డీటేల్ ఏంటంటే డ్రాగన్ పైకి బాణం వేస్తూ నిఖిల్ ఉండటం సర్వత్రా ఆసక్తి రేకెత్తిస్తుంది. కాగా టైటిల్ ఆర్ట్ లో కూడా ఇదే డ్రాగన్ హైలెట్ అవుతుంది. దీనిబట్టి చూస్తే హిస్టరీ తో ముడిపడిన మిస్టరీ థ్రిల్లర్ సినిమాలాగ ఉంది.

- Advertisement -

ఠాగూర్ మధు సమర్పణలో రాబోతున్న ఈ భారీ బడ్జెట్ సినిమాలో లక్కీ హీరోయిన్ సంయుక్త మీనన్ నిఖిల్ కు జోడిగా నటిస్తోంది. మనోజ్ పరమహంస ఈ సినిమాకు డివోపిగా వ్యవహరిస్తుండగా, కేజీఎఫ్ ఫేం రవి బసుర్ మ్యూజిక్ అందిస్తున్నారు. బింబిసార ఫేం వాసుదేవ్ మున్నెప్పగిరి ఈ సినిమాకు డైలాగ్స్ అందించనున్నారు. దాదాపు టాప్ టెక్నీషియన్స్ అందరితో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా.. మరీ ప్రేక్షకులను ఎంతవరకు అలరిస్తుందో చూడాలి.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు